అసిడిటీని ఇలా నివారించండి ..

Posted December 19, 2016

acidity problems treatmentటైం కి తినకి పోయినా..నిద్ర లేక పోయినా…అతిగా ఉప్పు కారం తిన్నా..ఉద్యోగాల బిజీ లో నైట్ షిఫ్ట్ లు పనిచేసినా అతిగా మద్యం..ధూమపానం చేసినా చాల మందిని గ్యాస్ సమస్య వేధిస్తుంటుంది..ఏ సమస్య నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే అలవాట్లను మార్చుకోవాల్సిందే..ఇదిలా ఉంటే అల్సర్స్‌ లేదా పేగుపూత ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మందిలో ఉన్న సమస్య. ఇది ఎలా వస్తుందంటే జీర్ణక్రియ లో ఆమ్లగుణం ఎక్కువగా ఉండి తిని వేయడం వలన ఏర్పడే పుండును పేగుపూత అంటారు.

పేగుపూత రకాలు
పేగుపూతలు అన్న సంచిలో డియోడినమ్‌, పెద్దప్రేగులో ఏర్పడతాయి.అన్నసంచిలో తయారు అయితే వాటిని గ్యాస్ట్రిక్‌ పేగుపూతలని అంటారు,పెప్టిక్‌ అల్సర్స్‌ అల్‌కోరేటివ్‌ కొలైటిస్‌ లక్షణాలు.ఇలా ఉంటాయి .
**కడుపునొప్పి
**మలమార్గంలో మంట, నొప్పిగా ఉండటం
**చాతిలో బరువుగా,మంటగా ఉండటం
**మలబద్ధకం గాని, లేదా చీటికి మాటికి విరేచనాలవడం.
**రక్తహీనత, బలహీనంగా అన్పించడం
**కొన్ని సందర్భాల్లో బరువు తగ్గిపోవడం.

వీటి వల్ల నష్టాలు

పేగుపూతలో ఎక్కువగా కనపడే అనర్థాలు ఏవిటంటే తయారైన పుండు నుంచి కొంచెం కొంచెం రక్తస్రావం అవుతూ ఉండటం.పేగుపూత దీర్ఘకాలికమైనపుడు జీర్ణాశయం డయోడినిమ్‌లో లోతుగా గాటులు ఏర్పడి వాటి వల్ల జీర్ణాశయం నుంచి గ్రహిణిలోకి ప్రవేశించి ద్వారం ఇరుకు అవుతుంది. దీనినే పైలోరిక్‌ స్టెనోసిన్‌ అంటారు.ఈ పరిస్థితి వల్ల ఆహారం అడ్గుకుని వాంతులు అవుతూ, త్వరగా బలహీనంగా మారతారు.
ఒక్కొసారి జీర్ణరసాలు పేగుపూత ద్వారా తయారైన రంధ్రం నుంచి బయటకి వస్తే పేగు లైనింగ్‌ దెబ్బతింటుంది. దీనినే పెరిటోనిటీస్‌ అంటారు. ఈ దీర్ఘకాలిక పేగుపూతలను అశ్రద్ధ చేస్తే వ్యాధి ముదిరి ఈ పుండు పగిలి పోతుంది. దీనినే పెర్‌ఫోరేషన్‌ అంటారు.
**ఆకలి లేకపోయిన తినడం
**జీర్ణం కాక మునుసే తినడం
**ఉపవాసాలు ఉండటం
**మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు
**పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా తినడం
**మానసిక అలజడి, ఒత్తిడి

నివారణ మార్గాలు

**మద్యపానం, ధూమపానం నిలిపివేయడం
**ఉపవాసాలు నిలిపివేయడం
**భోజనం మితంగా చేయడం
**నొప్పి సంబంధిత మందులను ఎక్కువగా వాడకుండా ఉండటం
**పులుపు, పచ్చిమిర్చి, మసాల పదార్థాలు మితంగా తినడం

వ్యాధి నిర్దారణ
**గ్యాస్ర్టో స్కోపి, కొలొనోస్కోపి
**ఎండొస్కోపి
**బేరియంమీల్‌ ఎగ్జామ్‌
**రక్తపరీక్షలు
**ఎక్స్‌ రే అన్నాశయం, డియోడినమ్‌ వంటి పరీక్షలు చేయించుకోవటం వల్ల సత్వర ఉపశమనం పొందవచ్చు.

SHARE