బన్నీ సినిమాలో మరో యాక్షన్ హీరో..

Posted March 28, 2017

action king arjun in allu arjun naa peru surya naa illu india movieరేసుగుర్రం, సరైనోడు వంటి హిట్ సినిమాలతో నిజంగానే రేసుగుర్రంలా పరుగుడెతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో   డీజే…  దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటిస్తున్నాడు బన్నీ. మే నెలలో  ఈ చిత్రం విడుదలకానుంది. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు బన్నీ. ఎవడు, రేసుగుర్రం వంటి సినిమాలకు  రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ ఈ తాజా సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ఆల్రెడీ  స్క్రిప్ట్ పనులను కంప్లీట్ చేసిన చిత్రయూనిట్  ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కోలీవుడ్ యాక్షన్ హీరో  అర్జున్ నటించానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. జెంటిల్ మన్, ఒకే ఒక్కడు  సినిమాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అర్జున్…  ప్రస్తుతం పలు భాషల్లోని సినిమాల్లో నెగెటివ్, పాజిటివ్ అనే తేడా లేకుండా డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు. దీంతో బన్నీ సినిమాలో కూడా ఓ కీ రోల్లో నటించడానికి అర్జున్ ని ఎంచుకున్నాడట వంశీ. అయితే అర్జున్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడని ఫిలింనగర్ వర్గాల టాక్. నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించనున్న ఈ చిత్రం  ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. అర్జున్ అంటే యాక్షన్ హీరోగా ఊహించుకునే తెలుగు అభిమానులు విలన్ గా అతన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.

SHARE