అతడు అయితే ఫ్రీగా చేస్తానంటున్న అందాల బ్యూటీ..!

0
296
actress aishwarya menon says if i get movie chance with arya i couldn't take remuneration

Posted [relativedate]

actress aishwarya menon says if i get movie chance with arya i couldn't take remunerationఈ గ్లామర్ ఫీల్డ్ లో కొత్త అమ్మాయి స్టార్ గా ఎదగాలి అంటే అంత సులభం కాదు.కొత్త అమ్మాయి కి అవకాశం రావాలన్నా.. అందరి దృష్టిని ఆకర్షించాలన్నా.. అందరికి సుపరిచితం కావాలన్నా.. పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకోవాలనుకున్నా ప్రచారం తప్పనిసరి. ఇందుకోసం కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చే అమ్మాయిలు చాలానే ప్రయత్నాలు చేస్తుంన్నారు. వాటిని పక్కన పెడితే.. మిగిలిన వారికంటే భిన్నమైన స్టేట్ మెంట్ తో ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది నటి ఐశ్వర్య మీనన్.

మలయాళం.. కన్నడ భాషల్లో నటిగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా వీర చిత్రంలో నటుడు కృష్ణకు జంటగా నటిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా చిన్న చిన్న సినిమాలు,అరకొర వేషాలే తప్పించి.. అగ్రహీరో పక్కన ఛాన్స్ మాత్రం కొట్టలేకపోతోంది. ఎలాగైనా పెద్ద హీరోతో సినిమా చేయాలి అనే లక్ష్యంతో ఇండస్ట్రీ అంతా తన గురించి మాట్లాడుకునీలా చేయాలి అని ఈ అమ్మడు ఒక కొత్తతరహా మాటను చెప్పింది. అదేంటంటే

తమిళ హీరో ఆర్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఎంత ఇష్టమంటే.. తన బెడ్ రూమ్ నిండా తన ఫొటోస్ ఉంటాయి అని చెప్పింది .. ఆర్య మూవీ లో అవకాశం కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను అని, ఆర్య సరసన నటించే అవకాశం రావాలే కానీ తనకు పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకొను అని చెప్పింది. కేవలం నోటి మాటతోనే పరిమితం కాకుండా ఆర్య ఎవరెవరితో చిత్రాలు చేస్తున్నాడో తెలుసుకొని.. తనకున్న మార్గాల ద్వారా తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ రాయబారాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఆర్యతో అవకాశం వచ్చినా.. రాకున్నా ఆయన పేరు పుణ్యమా అని ఐశ్వర్య మాత్రం ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది.

Leave a Reply