Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ కి ఎప్పుడైతే రాహుల్ నాయకుడు అవుతాడని భావించారో అప్పటినుంచి ఆ పార్టీ పతనావస్థకు దిగజారుతూనే వుంది.ఈ పరిస్థితిని చక్కదిద్ది పార్టీ ని గాడిలో పెట్టేందుకు రాహుల్ చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది.దీంతో రాహుల్ మీద అసమర్థుడు అన్న ముద్ర బలంగా పడింది. ఆ ముద్ర నుంచి రాహుల్ ని ఎలా బయటపడేయాలా అని ఆయన తల్లి,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తెగ తపనపడుతున్నారు.రాహుల్ కి రాజకీయంగా ఉజ్జ్వల భవిష్యత్ కల్పించాలంటే ఏమి చేయాలో తెలుసుకునేందుకు ఆమె ఓ సంస్థ ని సలహా కోసం సంప్రదించారట. ఆ సంస్థ చెప్పిన విషయం తో నోరెళ్లబెట్టిన సోనియా డామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారట.అందుకోసం కన్నడ నటి,కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్యని ఆమె ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆ సంస్థ సోనియా కి ఏమి చెప్పిందంటే..బీజేపీ ఓ వ్యూహం ప్రకారం రాహుల్ ని అసమర్దుడిగా చిత్రీకరించింది.ఇందుకోసం కమలనాధులు సోషల్ మీడియాని వాడుకున్నారు. రాహుల్ ఖ్యాతిని దెబ్బకొట్టేందుకు కొందరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించుకున్నారు.ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసి సాంప్రదాయ రాజకీయ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్,రాహుల్ దెబ్బతిన్నారు,తింటున్నారు అని సదరు సంస్థ చెప్పాక సోనియా కౌంటర్ వ్యూహం సిద్ధం చేస్తున్నారు . పార్టీ కోసం,రాహుల్ కోసం బలమైన సోషల్ మీడియా విభాగాన్ని రూపకల్పన చేస్తున్నారు.ఇందులో భాగంగా సోషల్ మీడియా వినియోగం లో పట్టున్న పార్టీ నాయకుల కోసం వెతుకుతుంటే మాజీ ఎంపీ రమ్య పేరు ముందుకు వచ్చిందట.అనుకున్నదే తడవుగా సోనియా రంగంలోకి దిగి రమ్యకి కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించబోతున్నారట.ఇందుకోసం ఓ టెక్నికల్,జర్నలిస్ట్ టీం రమ్య ఆధ్వర్యంలో త్వరలో రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.