మోడీతో హీరోయిన్ భేటీ ఎందుకో ?

 Posted October 29, 2016

actress gautami meets modi
ప్రధాని మోడీతో హీరోయిన్ గౌతమి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది .విలక్షణ నటుడు కమల్ హాసన్ తో సహజీవనం చేస్తున్న గౌతమి కి ప్రధాని ఇంటికి ఆహ్వానం రావడం విశేషమే.తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకోడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీవ్యూహం లో భాగమే ఈ సమావేశమని వార్తలొస్తున్నాయి. కానీ అలాటిదేమీలేదని గౌతమి చెప్తున్నారు .

ప్రధాని మోడీతో భేటీ విశేషాల్ని ఆమె వివరించారు .దేశం అభివృధ్ధికోసం తాను కంటున్నా కలల్ని మోడీ తనతో పంచుకున్నట్టు గౌతమి తెలిపారు.కాన్సర్ ని జయించిన ఆమె 2017 యోగా దినోత్సవం నాటికి ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు .దీనిపై ప్రధాని సూచనలు పాటిస్తానని గౌతమి వివరించారు .మోడీ తో భేటీ తర్వాతా కేంద్ర మంత్రి వెంకయ్యతో కూడా గౌతమి సమావేశం కావడం తో తమిళనాట కుతూహలం కనిపిస్తోంది .

SHARE