నటి హేమ ఇక నాయకురాలు..

Posted October 5, 2016

  actress hema attend kapu meeting
దాసరి ఆధ్వర్యంలో జరిగిన కాపు సమావేశానికి మెగా స్టార్ చిరు రాకపోయినా ఎవరూ ఊహించని ఓ కొత్త నాయకురాలు రంగంలోకి దిగారు.ఆమె మరెవరో కాదు వెండితెరపై సహాయనటి పాత్రల్లో వెలిగిపోయిన హేమ.ఆమెకి రాజకీయాల మీద ఇప్పుడే దృష్టి పడింది అనుకోవద్దు.గతంలో అంటే 2014 లో ఓ పార్టీ తరపున ఆమె అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నారు.పోటీ చేశారు.ఓడిపోవడమే కాదు డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు.ఇంతకీ ఆ పార్టీ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర .

ఆ తరువాత కొన్నాళ్ళకి మా అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో ఆమె చురుగ్గా వున్నారు.మెగా బ్రదర్ నాగ బాబు,రాజేంద్ర ప్రసాద్ మీద అబ్బో చాలా చెణుకులు వేసింది.అక్కడ మిస్ ఫైర్ అయ్యింది.హేమ సపోర్ట్ చేసిన జయసుధ ప్యానెల్ ఓటమి ఎదుర్కొంది.ఇప్పుడు మళ్లీ ముద్రగడకి మద్దతుగా దాసరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కాపు నాయకురాలిగా ఆమె హాజరయ్యారు .ఈసారైనా హేమ నటి కాదు నాయకురాలని జనం చేత అనిపించుకొంటుందేమో చూద్దాం .

SHARE