Thursday, September 23, 2021
HomeEntertainmentCinema Latestటాలీవుడ్‌లో మరో సినీ అవార్డు వేడుక

టాలీవుడ్‌లో మరో సినీ అవార్డు వేడుక

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులు చాలా సంవత్సరాలుగా ఇవ్వకుండా వదిలేశారు. తెలుగు రాష్ట్రాు విడిపోయిన తర్వాత వాటి గురించి పట్టించుకునే వారే లేరు. అప్పుడప్పుడు వాటి గురించి మాట్లాడినా ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. ఇక నంది అవార్డులను ఇటీవల ఏపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలకు గాను ప్రకటించింది. అయితే వాటిని ఇచ్చిన దాఖలాలే లేవు. నంది అవార్డుల సంగతి అలా ఉంచితే టాలీవుడ్‌లో స్వచ్చంద సంస్థలు, ఇతర మీడియా సంస్థలు ఇస్తున్న అవార్డులు ఎక్కువ అవుతున్నాయి.

ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా, సంతోషం, మా సినీమా అవార్డ్‌, జీ తెలుగు సినిమా అవార్డ్‌, టీఎస్పార్‌ అవార్డ్స్‌, ఎయన్నార్‌ అవార్డ్స్‌ ఇలా ఎన్నో అవార్డులు ఇస్తున్నారు. కొత్తగా ఇప్పుడు కళాతపస్వి పేరు మీద అవార్డులు ఇచ్చేందుకు నటి తులసి సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది. తనను సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన గురువు గారి పేరు మీద అవార్డు వేడుక నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈనెలలోనే హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లుగా చెప్పుకొచ్చింది. గవర్నర్‌ నరసింహన్‌ ఈ అవార్డులో వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ అవార్డు వేడుకకు స్టార్స్‌ వస్తారనే నమ్మకం లేదని మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

- Advertisment -
spot_img

Most Popular