ఆ రీమేక్ లో హీరోగా అడవి శేష్!!

Posted February 2, 2017

adavisesh hero in remake movieటాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తోంది. వేరే భాషలో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి హీరోలు సైతం ముందుకొస్తున్నారు. ఇందుకు పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా ఏమీ లేదు. వెంకీ దృశ్యం, చిరు ఖైదీ నెం150, నాగ్ ఊపిరి, పవన్ గోపాల గోపాల వంటి సినిమాలు రీమేక్ లే అయినా సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా మరో హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు.  

కోలీవుడ్ లో అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన శతురంగ వేట్టై సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, “ఎక్కడికి పోతావు చిన్నవాడా”  అంటూ ఆకర్షించిన నందితాశ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, గోపీ గణేష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.

SHARE