ఆదిత్య 369 … మళ్ళీ స్టార్ట్ … సారధి .?

0
780

adhitya

ఆదిత్య 369 … పాతికేళ్ల తీపి గతం…ఆ సినీ అనుభూతులు మనల్ని పావు శతాబ్దం వెనక్కి తీసుకెళ్లాయి. ఆ సినిమాలోని ఆదిత్య 369 టైం మెషిన్ ఏకంగా మనల్ని వందల  ఏళ్ళు  వెనక్కి తీసుకెళ్లింది. శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టింది. కంప్యూటర్ల ముందు కూర్చొని కల్యాణం చూసే భవిష్యత్ నీ చూపించింది…

IMG_0009 (2)

నిజంగా ఈ సినిమా ఓ విప్లవం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ విప్లవ కారుడు. సృజనాత్మక విప్లవకారుడు… కాలాన్ని ముందుకి  వెనక్కి తీసుకెళ్లాలన్న ఆలోచన హాలీవుడ్ తెరపై కనిపించినా దానికి ఫక్తు తెలుగు రంగు అద్దిన సింగీతంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ చిత్రంపై ఆరోజుల్లోనే కోటిన్నరకు పైగా ఖర్చుపెట్టిన ఓ యువ నిర్మాత సాహసానికి జై కొట్టాల్సిందే…ఆ నిర్మాతే శివలెంక కృష్ణప్రసాద్. ఆదిత్య రథానికి సింగీతం, శివలెంక చక్రాలైతే … దాన్ని సాఫీగా లాగిన సారధి బాలకృష్ణ…నందమూరి బాలకృష్ణ.

IMG_0018 - Copy (3)

తెలుగు సినీరంగంలో మాస్ మసాలా చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఇలాంటి సబ్జెక్టుకు ఓకే చెప్పడం బాలయ్య తెగువకి నిదర్శనం. నిజంగా కృష్ణదేవరాయల్ని తలపించిన ఆయన నటనావైదుష్యం నేటికీ తలమానికం…ఈ ముగ్గురితోపాటు మరెందరో తెరవెనక, తెరముందు దిగ్విజయంగా ఆదిత్య 369ని నడిపించారు.

IMG_0010

ఆ టైం మెషిన్ ‘ఆదిత్య 369’ మళ్లీ స్టార్ట్ కాబోతుందా? ఎస్ … మళ్లీ అది కాలంలోకి ప్రయాణించబోతోంది. ఇప్పటికే దాని ప్రయాణ మార్గం, గమ్యం, సింగీతం దగ్గర భద్రంగా నిక్షిప్తమయ్యాయి. పాత నిర్మాత శివలెంక కొత్త ఉత్సాహంతో ‘ఇంధనం’ ఇచ్చేందుకు సిద్ధంగా వున్నాడు… ఇక రథసారథి ఎవరన్నదానిపైనే సందేహాలు…బాలయ్యకు బదులు … ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆదిత్య 369 తో సినీ జర్నీ మొదలుపెట్టవచ్చని ఫిల్మ్ నగర్ టాక్…చూద్దాం… తండ్రి, తనయుల్లో ఎవరు ఆదిత్య 369 ని నడిపిస్తారో?  ఏమైనా ఆదిత్య 369 … ఓ తీపి గతం… ఓ కొత్త ప్రయత్నం…ఎప్పటికీ, ఎన్నటికీ ఇదే విశేషణం ఉపయోగించగలిగే అపురూప చిత్ర రాజం.

IMG_0010 - CopyIMG_0009 - Copy (3)IMG_0020 - Copy (3)

Leave a Reply