నేను యూత్ అంటున్న యోగి!!!

Posted March 22, 2017

adithya nadh pretendsto be youth
యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ … ముఖ్య‌మంత్రి కాక‌ముందు ఎంపీ .. ఆయ‌న ఇంకా ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు. దీంతో ఇటీవ‌ల ఆయ‌న లోక్ స‌భ‌కు వ‌చ్చారు. అస‌లే పెద్ద‌రాష్ట్రానికి సీఎం. అందులోనూ బ్ర‌హ్మాండ‌మైన విజ‌యం. కాబ‌ట్టి ఆయ‌నే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. తోటి ఎంపీ సీఎం అయ్యారు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు విషెస్ చెప్పడానికి స‌భ్యులంతా పోటీ ప‌డ్డారు.

ఇక లోక్ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగం ఎప్పుడు ఉంటుందా అన్న ఆస‌క్తి అంద‌రిలో క‌నిపించింది. చివ‌ర‌కు ఆ సంద‌ర్భం రానే వ‌చ్చింది. తాను స‌న్యాసం తీసుకున్నాను కాబ‌ట్టి.. త‌న ఏజ్ ఎక్కువ ఉంటుంద‌ని అంద‌రు భావిస్తార‌ని అనుకున్నారో.. మ‌రే కార‌ణ‌మో .. కానీ ముందు త‌న వ‌య‌స్సుపై క్లారిటీ ఇచ్చారాయన‌. అదీ కూడా మోడీ స్టైల్ లో. విప‌క్షాల‌పై సెటైర్ల వేసి ఆక‌ట్టుకున్నారు.

త‌న వ‌య‌స్సుపై కాంగ్రెస్, ఇత‌ర ప్ర‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయంటూ యోగి ఆదిత్య‌నాథ్ మొద‌లుపెట్టారు. వ‌య‌స్సును మాత్రం చెప్ప‌కుండా..తాను రాహుల్ గాంధీ కంటే ఒక ఏడాది చిన్న‌వాడిన‌ని… యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ కంటే చాలా పెద్ద‌వార‌ని న‌వ్వులు పూయించారు. ఎప్పుడూ సీరియ‌స్ గా క‌నిపించే ఆయ‌నలో ఇంత హాస్యం క‌నిపించ‌డంతో విప‌క్ష స‌భ్యులు స‌హా అంద‌రూ న‌వ్వుల్లో మునిగిపోయారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్, స‌మాజ్ వాదీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌నిలో ప‌నిగా ప్ర‌ధాని మోడీపైనా ప్ర‌శంస‌లు కురిపించారు.

మొత్తానికి లోక్ స‌భ‌లో యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌సంగం విన్న‌వారు ఈ సీఎం గ‌ట్టోడేన‌ని గుస‌గుస‌లాడుకున్నారు. లేక‌పోతే అంత ఈజీగా మోడీ, అమిత్ షా.. ఆదిత్య‌నాథ్ ను సీఎంగా ఎందుకు ఎంపిక చేస్తారు? విప‌క్షాల‌కు ఆ విష‌యం ఇప్పుడు అర్థమైంది.

SHARE