Posted [relativedate]
2014 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ సీనియర్ నేత అద్వానీ… మోడీ ప్రధాని మోడీ అభ్యర్థిత్వంపై గుర్రుగా ఉన్నారని వార్తలొచ్చాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందని ప్రచారం జరిగింది. మోడీ శకం మొదలుకావడంతో సీనియర్లను పట్టించుకోవడం లేదని అద్వానీ అసంతృప్తి ఉన్నారట. అయితే యూపీ ఎన్నికల ఫలితాలతో ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ పూర్తిగా తొలగిపోయిందని టాక్. అంతేకాదు యూపీలో అఖండ విజయంపై పెద్దాయన… మోడీని అభినందనల్లో ముంచెత్తారట. ఇంతటి విజయం సాధించడంపై ఆయన కళ్లలో ఆనంద భాష్ఫాలు కూడా వచ్చాయట.
అద్వానీ రియాక్షన్ చూసి ప్రధాని మోడీ కూడా ఉబ్బితబ్బిబ్బైపోయారని టాక్. ఈ పరిణామంతో అద్వానీ పట్ల ఆయన మనసు పూర్తిగా కరిగిపోయిందట. ఇక పెద్దాయన పట్ల తన దృక్పథాన్ని మార్చుకోవాలని మోడీ నిర్ణయించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అద్వానీని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానని మోడీ బాగా ఫీలయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ రాజకీయ భీష్ముడిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ విషయంపై అమిత్ షా, ఇతర అగ్ర నాయకులతోనూ మాట్లాడినట్టు సమాచారం. అద్వానీజీని ప్రెసిడెంట్ చేద్దామని ప్రతిపాదించారని టాక్.
అద్వానీకి రాష్ట్రపతి పదవి ఇస్తానంటే కాదనే వారు ఎవరుంటారు. ఎలాగూ రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి సొంత బలం ఉంది. ఇక పెద్దాయనే బరిలో ఉంటే… ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇక అద్వానీ రాష్ట్రపతి కావడానికి లైన్ క్లియర్ అయిపోయినట్టేనని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీని ఈ స్థాయిలో నిలబెట్టడానికి దశాబ్దాల పాటు కృషి చేసిన ఈ రాజకీయ భీష్ముడు…రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడని పార్టీలకతీతంగా అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే ఇక అద్వానీ ప్రెసిడెంట్ కావడం లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది. ఇదే నిజం కావాలని అద్వానీ వర్గంకూడా బలంగా కోరుకుంటోంది!!