వాయు ప్రయాణం మరింత ప్రియం..

  aeroplane journey passenger ticket cost increase for krishna pushkaralu

ప్రభుత్వం పుష్కరాలకు వెళ్లే వారికి కోసం ఉచిత బస్సులు నడుపుతోంది. రైల్వే శాఖ అదనపు సర్వీసులు నడిపి సేవలందిస్తోంది. ప్రయాణికులపై అదనపు భారాలు వేయకుండా చూస్తోంది. అయితే విమానాశ్రయాల్లో మాత్రం టిక్కెట్‌ ధరలు ఒటికి మూడు రెట్లు పెంచేశారు. అందినంత దోచుకుటున్నారనే విమర్శ ఉంది. ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. ఒక్కసారిగా పెరిగిన టిక్కెట్‌ ధరలు విని చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పన్నేండు రోజుల్లో విమానాలు ఎక్కెవారంతా డబ్బు కట్టలు జేబుల్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశ, విదే శాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సర్వీసులు రోజుకు 28 నుంచి 34 వరకు నడుస్తున్నాయి. ప్రయాణీకులు 1500 నుంచి 3200లకు చేరుకుంది. ఇదే అదునుగా భావించిన విమానయాన సంస్థలు టిక్కెట్‌ ధరలు అమాంతంగా పెంచేసిఅందినంత దండుకుంటున్నాయనే వాదనుంది. న్యుఢిల్లి, హైదరాబాదు, బెంగుళూర్‌, చెన్నై ప్రాంతాల నుంచి ప్రయాణీకులు ఎక్కువగా వస్తూ అదనపు టిక్కెట్‌ ధరల భారిన పడుతున్నారు. పుష్కరాలకు కొత్త సర్వీసులు నడుపుతామని చెప్పిన ప్రభుత్వం ఆతర్వాత చేతులెత్తేసింది. విమానయాన సంస్థలు ముందుకు రాకపోవడమే దానికి కారణం. ప్రభుత్వం శ్రద్ద పెడితే కొత్త సర్వీసులు వచ్చేవి.టిక్కెట్‌ ధరలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదని చెబుతున్నారు.

కొత్త సర్వీసులు లేని కారణంగా ఉన్న సర్వీసుల వారు ధరలు పెంచి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రయివేటు సంస్థలైన ఎయిర్‌కోస్టా, ట్రూజెట్‌, స్పైస్‌ జట్‌ సంస్థలైతే విపరీతంగా ధరలు పెంచాయని చెబుతున్నారు. ఈ వారం రోజుల్లో వాటి ధరలు చూస్తే అమ్మో..అనాల్సిందే. టిక్కెట్‌ ధరలను పరిశీలిస్తే….విజయవాడ నుంచి చెన్నై రూ.1400నుంచి 2,400 ప్రస్తుతం రూ.13 వేలు, విజయవాడ నుంచి హైదరాబాదు రూ.1800 నుంచి 3 వేలు ప్రస్తుతం రూ.10 వేలు . విజయవాడ నుంచి బెంగుళూర్‌ రూ.2 వేల నుంచి రూ.3 వేలు ప్రస్తుతం రూ.12 వేలు, విజయవాడ నుంచి హైదరాబాదు రూ. 1800 నుంచి 2,400 ప్రస్తుతం రూ.10 వేలు, బెంగుళూర్‌ నుంచి విజయవాడకు రూ.3 వేలు ప్రస్తుతం రూ.9 వేలు, విజయవాడ నుంచి చెన్నైకి రూ.1500 ప్రస్తుతం రూ.9 వేలు, విజయవాడ నుంచి తిరుపతికి రూ.1500 ప్రస్తుతం రూ.7,500, వైజాగ్‌ నుంచి విజయవాడకు రూ.1200 రూ.6వేలు, ఎయిర్‌కోస్టా విజయవాడ నుంచి బెంగుళూర్‌కి రూ.3 వేలు ప్రస్తుతం రూ.8వేలు, ఈ ధరలు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమలవుతుంటాయి. స్పాట్‌లో టిక్కెట్‌ అడిగితే దాని ధర వేలల్లోకి వెళ్లిపోతుంది.

SHARE