Posted [relativedate]
ఆర్య సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ ఆ ఒక్క సినిమాతోనే యూత్ పల్స్ పట్టేశాడు. సుక్కు సినిమా అంటే చాలు యూత్ అంతా ఎగబడేలా చేసుకున్న ఈ దర్శకుడు ఆర్య తర్వాత తను తీసిన ఇన్ని సినిమాలకు వేరే రచయితల దగ్గర సహకారం తీసుకున్నాడు. అయితే ఎందుకో ఏమో ఈసారి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీస్తున్న మూవీకి అన్ని తానై నడిపించాలని చూస్తున్నాడట.
అంటే మూల కథే కాదు మొత్తం కథ కథనం అంతా కేవలం సుకుమార్ మాత్రమే రాస్తున్నాడట. దీనికి కారణం ఏమై ఉంటుందో తెలియదు కాని సుకుమార్ మళ్లీ ఆర్య తర్వాత చరణ్ సినిమాకే సొంతంగా రాస్తున్నాడు అంటే కచ్చితంగా ఆర్య మ్యాజిక్ ఈ సినిమాలో కూడా వర్క్ అవుట్ అవుతుందేమో అని ఫ్యాన్స్ ఇప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు. ఓ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అని అంటున్నారు.
స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తున్నా సరైన హిట్ పడక సుకుమార్ డైరక్టర్ లిస్ట్ లో టాలెంట్ ఉన్నా సరే వెనుకపడి ఉంటున్నాడు. మరి ఈ సొంత కథతో అయినా దిమ్మతిరిగే హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపిస్తాడేమో చూడాలి.