చంద్రబాబును కదిలించిన చిన్నారి

174

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

after heart transplant surgery master yeshwanth meets chandrababu in ap secretariatఏపీ సీఎం చంద్రబాబు పని విషయంలో ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. వర్క్ మైండెడ్ నేతగా ఆయనకు చాలా మంచి పేరుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన భావోద్వేగం బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అది ఆవేశంలో అయినా.. ఆవేదనలో అయినా. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆయన కదిలిపోయినట్లుగా కనిపిస్తుంటారు. అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది.

ఏపీ సచివాలయంలో పని హడావుడిలో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చిన ఒక చిన్నారి నోట నుంచి వచ్చిన మాటలు ఆయన్ను తీవ్రంగా కదిలించేశాయి. నా ప్రాణాలు మీరే కాపాడారు సార్ అంటూ చిన్నారి నోటి నుంచి వచ్చిన మాటలతో ఒక్కసారిగా చలించిపోయిన బాబు.. వెంటనే ఆ బాబును అక్కున చేర్చుకున్నారు.తన తీరుకు భిన్నంగా ఆ చిన్నారిని చాలా ఆత్మీయంగా యోగ క్షేమాల గురించి పలుకరించటమే కాదు.. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. బాబు ఇలా కదిలిపోవటం చాలా అరుదుగా చెబుతుంటారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యశ్వంత్ అనే చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. బాబు తల్లిదండ్రులకు అంతస్తోమత లేకపోవటంతో ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.7లక్షలు అందజేశారు. శస్త్రచికిత్స అనంతరం అతడికి వైద్యం చేసిన వైద్యులతో సహా చిన్నారి తల్లిదండ్రులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బాబు నోటి నుంచి వచ్చిన మాటలు ఆయన్ను కదిలించి వేశాయి. చిన్నారికి వైద్య ఖర్చుల కోసం రూ.5లక్షల సాయాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాబులోని మరో యాంగిల్ కు అక్కడి వారంతా కదిలిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here