షా టూర్‌.. వెంకయ్యకి పరేషాన్‌.!

0
540
Against Venkayya's anti-BJP slogans are the slogans of the BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Against Venkayya's anti-BJP slogans are the slogans of the BJP

లీవ్‌ టీడీపీ.. సేవ్‌ బీజేపీ.. ఇదీ విజయవాడలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ కార్యకర్తల నినాదాల తీరు. చంద్రబాబుని వదిలించుకుంటే తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతమయ్యే పరిస్థితి లేదు. అలా జరగాలంటే వెంకయ్యనాయుడు కబంధ హస్తాల నుంచి, భారతీయ జనతా పార్టీని రక్షించాలంటూ నినాదాలతో హోరెత్తించేశారు. కార్యకర్తల తీరుతో వెంకయ్యనాయుడు ఒకింత ఇబ్బందిపడ్డారన్నది నిర్వివాదాంశం. వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కారు.. బీజేపీ కార్యకర్తలు ఇలాంటి పనులు చేయరు.. అంటూ వెంకయ్య వేదికపైనుంచే అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది.

అయినాసరే, బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం తగ్గలేదు. దేశమంతటా బీజేపీ అవినీతి రహిత పాలన అందిస్తోంటే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారనీ, ఆ మకిలి బీజేపీకి కూడా అంటుతోందని బీజేపీ కార్యకర్తలు గుస్సా అయ్యారు. అయితే, ఇదంతా వెంకయ్యనాయుడుకి వ్యతిరేకంగా ప్రీ ప్లాన్డ్‌గా ఏర్పాటు చేసిన వ్యవహారమా.? అన్న అనుమానాలూ లేకపోలేదు. బీజేపీలో ఈ మధ్యకాలంలో వెంకయ్య అనుకూల వర్గం, వెంకయ్య వ్యతిరేక వర్గం తయారయ్యాయి. నిజానికి, ఈ రెండు వర్గాల్లో ఒక వర్గం, చంద్రబాబుని పూర్తిగా వ్యతిరేకించే వర్గం. చంద్రబాబు మీద వ్యతిరేకతే, వెంకయ్య మీదకు మళ్ళింది.
ఎందుకంటే, చంద్రబాబుని ప్రతి సందర్భంలోనూ వెంకయ్య వెనకేసుకొస్తుండడం సోకాల్డ్‌ వెంకయ్య వ్యతిరేక వర్గానికి అస్సలేమాత్రం గిట్టడంలేదాయె. అదీ అసలు విషయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సందర్భంలో తన ప్రాభవం చాటుకోవాలనుకున్న వెంకయ్యనాయుడికి, ఈ ఘటన పెద్ద షాకే ఇచ్చిందని చెప్పక తప్పదు. చంద్రబాబుకి సంబంధించి అధిష్టానం వద్ద ప్రతిసారీ వెంకయ్య వెనకేసుకొస్తున్న వైనం కొన్ని సందర్భాల్లో బీజేపీ అధిష్టానానికీ ఆగ్రహం తెప్పిస్తోందన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో బెజవాడలో బీజేపీ కార్యకర్తలు లీవ్‌ టీడీపీ సేవ్‌ బీజేపీ నినాదాలు, వెంకయ్యకి వ్యతిరేకంగా ఆందోళనలు.. ఎలాంటి పరిణామాలకు కారణమవుతాయో.

Leave a Reply