వెనక్కే వెళదాం… వ్యవసాయ శాఖ

 agriculture commity go backwordఔను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ తాజా నినాదం ఇదే.. వెనక్కే వెళదాం. అంటే ప్రాచీన వ్యవసాయ పద్ధతులకే ఓటేద్దాం అని నిర్ణయించుకుంది.ఆ నిర్ణయాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు వివిధ రాయితీలను కూడా ప్రకటించింది.ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులలో పండించిన పంటలకు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో వ్యవసాయ శాఖ అడుగులు ఇలా పడుతున్నాయి.
ఆరోగ్యానికి హాని చేయని ఉత్పత్తులు కేవలం ప్రకృతి వ్యవసాయం తోనే సాధ్యమని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి.అటు పెట్టుబడుల పరంగాను ప్రకృతి వ్యవసాయం చౌకగా చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపధ్యంలో రసాయన మందుల వాడకం తగ్గించి,ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకొంది.

అందులో ముఖ్యమైనవి

1.పాత కాలంలో రైతులు అనుసరించిన వ్యవసాయ విధానాలకు తిరిగి ప్రాచుర్యం కల్పించాలి.


2. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేయాలి.


3. ఒక్కో క్లస్టర్ పరిధిలో 300 మంది రైతుల్ని ప్రకృతి సాగుకు ప్రోత్సహించాలి.
4. ప్రకృతి సాగుకు అవసరమైన కాషాయాలు,అమృతాలు తయారు చేసేవారికి 50 శాతం రాయితీలు ఇవ్వాలి.
5. ప్రకృతి సాగుకు అవసరమైన సేంద్రీయ ఉత్పాదనలు అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేస్తే 50 వేల రూపాయల రాయితీ ప్రభుత్వమే ఇస్తుంది.


6. దీంతోపాటు జీవమృతాల తయారికి అవసరమైన ఆవుల కొనుగోలుకు ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తుంది.
7. ఒక్కో ఆవు వల్ల 15 ఎకరాల ప్రకృతి సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనావేస్తోంది.


8. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి,ప్రభుత్వానికి రైతులకు మధ్య అనుసంధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లను నియమిస్తున్నారు.
9. ఒక్కో క్లస్టర్ పరిధిలోని రైతులకు 2 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలు అందజేస్తారు.
10. ఇలా ప్రకృతి పద్ధతుల్లో సిద్ధమైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here