డీఎంకే వలలో 15 మంది ఎమ్మెల్యేలు!!

Posted February 11, 2017

aiadmk mlas close to dmk party
ఒకే వర్గానికి చెందిన ఇద్దరి గొడవ.. మూడో వ్యక్తికి ఏవిధంగా లాభం చేకూరుస్తుందో.. ఇప్పుడు తమిళనాడులోనూ అదే జరుగుతోంది. ఒకే పార్టీకి చెందిన సెల్వం, చిన్నమ్మ గొడవతో డీఎంకే ఫుల్ లాభపడుతోంది. ఇదే అదనుగా బలపడేందుకు డీఎంకే నేత స్టాలిన్ పావులు కదుపుతున్నారు.

తమిళనాడులో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు చాలా కీలకంగా మారారు కాబట్టి.. అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలపై కన్నేశారట స్టాలిన్. ఇప్పటికే మంతనాలు కూడా జరిపారని టాక్. అన్ని విధాలా అండగా ఉంటానని ఆ ఎమ్మెల్యేలకు స్టాలిన్ అభయం ఇచ్చేశారట. ఇందుకోసం తెర వెనక భారీగానే బేరసారాలు సాగాయని ప్రచారం జరుగుతోంది. అలాంటి ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు శశికళ క్యాంపులోనే ఉన్నారట. ఎప్పటికప్పుడు విషయాలను స్టాలిన్ కు చేరవేస్తూ.. గురుభక్తిని చాటుకుంటున్నారని సమాచారం.

ఇప్పటికే డీఎంకే బలమైన ప్రతిపక్షంగా ఉంది. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నాయి. కాంగ్రెస్ కు చెందిన 8 మందికి కలుపుకుంటే బలం 97 కు చేరుతుంది. ఈ నెంబర్ కు మరో 15 మంది ఎమ్మెల్యేలు వచ్చారంటే.. ప్రభుత్వమే ఏర్పాటు చేసేంత సీన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచన చేయకపోయినా… ఎంతకైనా మంచిదని ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకున్నారట స్టాలిన్.

15 మంది ఎమ్మెల్యేలు తనదారిలోకి వచ్చారన్న విషయంపై స్టాలిన్.. సెల్వంతోనూ మాట్లాడారని సమాచారం. బలనిరూపణ సమయంలో తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. మొత్తానికి స్టాలిన్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సెల్వంకు మద్దతు ముసుగులో చాపకింద నీరులా తాను అనుకున్నది చేసేస్తున్నారు.

SHARE