పళని క్యాంపులో తిరుగుబాటు!!

0
310
aiadmk mlas want to decide no support to palaniswamy

Posted [relativedate]

aiadmk mlas want to decide no support to palaniswamy
సీఎం పళనిస్వామి బలనిరూణకు సిద్ధమమవుతున్న తరుణంలో .. ఆయన క్యాంపులోనే తిరుగుబాటు మొదలైంది. 20 మంది ఎమ్మెల్యేలు పళనికి షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. పైకి మాత్రం సపోర్ట్ చేస్తామంటూనే… అసెంబ్లీలో మాత్రం వ్యతిరేకంగా ఓటేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

పళని క్యాంపులో రెబల్ జెండా ఎగురవేస్తున్న వారంతా డీఎంకేతో పాటు పన్నీర్ సెల్వంతోనూ టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారే ఈ ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది ఉన్నారని టాక్. మినిస్ట్రీల విషయంలో పళిని … తమను మోసం చేశారని ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. అందుకే బలపరీక్షలో అసలు షాకిచ్చేందుకు రెడీగా ఉన్నారట.

రెబల్ ఎమ్మెల్యేల విషయం పళనిదాకా వెళ్లిందట. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారని తెలుస్తోంది. బలపరీక్షలో తాను గెలిస్తే ఆ 20 మందిలో .. నలుగురికైనా మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టారట. కానీ రెబల్స్ మాత్రం ఆయనను నమ్మడం లేదట. విశ్వాసపరీక్ష సమయంలో పళనిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్టు సమాచారం.

Leave a Reply