ఏఐడీఎంకే ప్రధాన కార్య దర్శి గా శశికళ…

Posted December 10, 2016

aiadmk new general secretary sasikalaఅమ్మ నిచ్చెలి, ప్రాణసఖిగా ఉన్న శశికళకు అన్నాడీఎంకే నేతలు పార్టీ బాధ్యతలు అప్పగించారు. కొద్దిసేపటి క్రితం పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. సచివాలయంలో సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు బాధ్యతలు స్వీకరించారుతమిళనాడులో జయలలిత స్మారక మందిరం నిర్మించాలని నిర్ణయించారు. అమ్మ ప్రవేశపెట్టిన పథకాలను ఇలాగే కొనసాగించాలని కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే అమ్మ సీఎంగా ఉన్నప్పుడు వ్యతిరేకించిన మధురవాయల్‌- చెన్నై పోర్టు పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదించింది. జయలలిత వ్యతిరేకించిన మధురవాయల్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

SHARE