కిందపడ్డా.. మన్నార్ గుడిదే పైచేయి..!

0
511
AIADMK party going to Mannargudi mafia hands

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

AIADMK party going to Mannargudi mafia handsతమిళనాడులో అన్నాడీఎంకే కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలు విలీనం కాబోతున్నాయని, శశికళ కథ, మన్నార్‌గుడి మాఫియా స్టోరీ ముగిసిపోయాయని అందరూ అనుకున్నారు. కాని కథ అడ్డం తిరిగింది. రెండు వర్గాల మధ్య చర్చలు స్తంభించాయి. సయోధ్య కుదరలేదు. పన్నీరు శెల్వం వర్గం కోరిక ప్రకారం శశికళను బయటకు పంపామని, దివాకరన్‌ లంచం కేసులో ఇరుక్కొని తనకు తానే దొరికిపోయాడని, పన్నీరు కోరిన ప్రకారం పార్టీ కార్యాలయంలో శశికళ బ్యానర్లు, ఫోటోలు తీసేశామని, అయినప్పటికీ ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని సీఎం పళనిసామి వర్గం ఆరోపించింది.

శశికళను, దినకరన్‌ను అధికారికంగా బహిష్కరించలేదని పన్నీరుశెల్వం వర్గం ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రధాన కార్యదర్శి పదవి తనకే ఇవ్వాలని పన్నీరు డిమాండ్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో పళనిసామి వర్గం మళ్లీ మన్నార్‌గుడి మాఫియాకు రెడ్‌ కార్పెట్‌ పరిచింది. ఎన్నికల గుర్తు రెండాకులును రాబట్టుకునే విషయంలో శశికళ వాదనలను సమర్థిస్తూ పళనిసామి వర్గం ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్‌ సమర్పించింది. దినకరన్‌ కేసులో ఇరుక్కోవడంతో శశికళ తన అన్న కుమారుడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

విచిత్రమేమిటంటే ఇన్నాళ్లు ఎక్కడో దూరంగా ఉన్న శశికళ భర్త నటరాజన్‌, ఆయన సోదరుడు వి దివాకరన్‌ అన్నాడీఎంకేలో ప్రత్యక్షమయ్యారు. 2011లో జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి తరిమేసిన 14 మంది మన్నార్‌గుడి మాఫియా గ్యాంగులో నటరాజన్‌, దివాకరన్‌ కూడా ఉన్నారు. అప్పటి నుంచి శశికళ తప్ప వేద నిలయంలో వేరేవారికి చోటు లేకుండా పోయింది. అప్పుడు బయటకు వెళ్లిన గ్యాంగంతా మళ్లీ చేరుకుంటోంది. సో… అన్నాడీఎంకేలో కథ మళ్లీ మొదటికి వచ్చి పార్టీ మన్నార్‌గుడి మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇక ముందు ఏం జరుగుతుందో…!

Leave a Reply