బీజేపీలో అన్నాడీఎంకే విలీనం తప్పదా?

Posted December 22, 2016

AIADMK party merge in bjp party in tamil nadu politics
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ మధ్య రోజురోజుకు దూరం పెరుగుతోంది. ఈ ఇద్దరి మధ్య సీఎస్ రామ్మోహన్ రావు నలిగిపోతున్నారు. అయితే ఆయన కూడా ఈ మధ్య సెల్వం సారు వైపు మొగ్గు చూపిస్తున్నారట. అదే ఆయనకు బ్యాడ్ టైమ్ ను తెచ్చిపెట్టిందని ప్రచారం జరుగుతోంది.

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇప్పుడు అన్నాడీఎంకేలో శశిశకళే సుప్రీమ్. సెల్వం కంటే కూడా చిన్నమ్మకే ఎక్కువ పవర్ ఉంది. సెల్వం పేరుకే సీఎం. వ్యవహారాలన్నీ చిన్నమ్మవర్గమే చూసుకుంటోందని టాక్. దీంతో అటు బీజేపీ అధిష్టానం కూడా ప్రాక్టికల్ గా ఆలోచించిందట. శశికళను దారిలోకి తెచ్చుకోవాలని డిసైడైందట. అందుకే ఈ మధ్య సెల్వం ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినా లాభం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. శశితో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే రామ్మోహనరావును టార్గెట్ చేశారన్న అనుమానాలున్నాయి.

శశికళ ముందు బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనను ఉంచారని ప్రచారం జరుగుతోంది. అదేంటంటే కొంతకాలం తర్వాత అన్నాడీఎంకేను బీజేపీలో విలీనం చేయాలట. దీనికి ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చిన్నమ్మకు అర్థమైందట. అందుకే కమలనాథులు ఏం చెప్పినా ఒప్పుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. అన్నాడీఎంకే.. బీజేపీలో విలీనం ఖాయమంటున్నారు పరిశీలకులు. అది జరిగే వరకు తమిళనాడులో ఎవరో ఒకరిపై ఐటీ దాడులు తప్పవన్న వాదన బలంగా వినిపిస్తోంది.

SHARE