ఆ 40 మంది చేతిలో తమిళ రాజకీయం?

Posted February 9, 2017

aiadmk party mlas decided to tamil nadu politics
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో శశికళ బలమెంత..పన్నీర్ వర్గమెంత ? ఈ ఒక్క ప్రశ్నకి సరైన జవాబు దొరికితే తమిళ రాజకీయాల చిక్కుముడి విప్పినట్టే.అయితే ఈ ప్రశ్నకి తలో రకం సమాధానాలు చెబుతున్నారు.శశికళ వర్గం తమకి 130 మంది ఎమ్మెల్యేల బలముందని ప్రకటించింది.పన్నీర్ సెల్వం తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు వున్నారని చెబుతున్నారు.ఈ రెండూ కలిపితే అన్నాడీఎంకే అసలు బలం కన్నా చాలా ఎక్కువ.అక్కడే సమస్య వస్తోంది.నిజానికి 130 మంది ఎమ్మెల్యేలు వున్నారని చెప్పిన శశికళ క్యాంపు లో వుంది కేవలం 90 మంది మాత్రమేనని తెలుస్తోంది.ఇక 40 మంది బలముందని చెప్పిన పన్నీర్ ఇంట్లో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వున్నారు.అంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఈ క్యాంపు లకి చిక్కకుండా అజ్ఞాతంలో వున్నారు.వారు ఎటు వైపు మొగ్గితే తమిళ రాజకీయం అటు వైపు మొగ్గుతుంది.

ఇక కుల రాజకీయం కూడా ఈసారి సరికొత్త పద్ధతిలో తమిళ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతోంది. ఇక్కడ అధికారం కొట్టుకుంటున్న శశి,పన్నీర్ చెరో కులానికి చెందినవారు కాదు.ఇద్దరు అన్నాడీఎంకే లో కీలక పాత్ర పోషిస్తున్న దేవర్ కులానికి చెందినవారే.ఇప్పుడు అన్నాడీఎంకేలో ఆ కులానికి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు వున్నారు.వారిలో 18 మంది శశికళ క్యాంపు లో ఉండగా మిగిలిన 20 మంది అజ్ఞాతంలో వున్నారు.

అన్నాడీఎంకే లో శశి,పన్నీర్ మధ్య నలిగిపోతోంది అజ్ఞాతంలో వున్న 40 మంది.దేవర్ కులానికి చెందిన 38 మంది.ఇప్పటికైతే ఎటూ తేల్చుకోలేకపోతున్న అజ్ఞాతంలోని 40 మంది ఎటు మొగ్గితే వారికే సీఎం పీఠం దక్కొచ్చు.

SHARE