అధికార పార్టీలో “ఆర్కే నగర్” గుబులు!!!

0
263
aiadmk party troubles with rk nagar constituency by-elections in tamil nadu

Posted [relativedate]

aiadmk party troubles with rk nagar constituency by-elections in tamil nadu
తమిళనాడులో ఇప్పుడు అందరి కళ్లు ఆర్కే నగర్ పైనే ఉన్నాయి. ఏప్రిల్ 12న ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. దివంగత జయలలిత ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో బై పోల్ లో ఎవరు నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే అందరికంటే అధికార పార్టీలో ఈ ఎన్నిక గుబులు రేపుతోంది.

ఆర్కే నగర్ ఉప ఎన్నిక తమిళనాడు రాజకీయాలకు దశ-దిశ చూపెడుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపైనే… ఆ రాష్ట్ర భవితవ్యంపై అంచనాలు రానున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నిక చిన్నమ్మకు పెద్ద అగ్ని పరీక్ష. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆమె పెద్ద దిక్కుగా ఉన్నారు. పైగా అన్నాడీఎంకేకు ఇది సిట్టింగ్ సీటు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం శశికళ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అటు పళనిస్వామికి కూడా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఒక సీఎంగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆయనపై ఉన్న అసంతృప్తి మరింత పెరిగే అవకాశముంది.

అటు దీప కొత్త పార్టీ పెట్టి ఇప్పటికే చిన్నమ్మ వర్గంలో గుబులు రేపుతున్నారు. ఆర్కే నగర్ లో పోటీ చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇవ్వడమే కాకుండా.. ఇప్పటికే చాపకింద నీరులా అక్కడ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. జయలలితకు స్వయానా మేనకోడలు కావడంతో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని శశికళ వర్గీయులు అంచనా వేస్తున్నారు. దీపకు ఆర్కే నగర్ మంచి ఫాలోయింగ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంపదీసి దీప.. అధికార పార్టీకి షాక్ ఇస్తుందా అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

మొత్తానికి ఆర్కే నగర్ పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలెన్ని పోటీ చేసినా… శశికళకు మాత్రం ప్రజాక్షేత్రంలో బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం. ఒకవేళ ఆర్కేనగర్ లో ఓటమి ఎదురైతే మాత్రం చిన్నమ్మకు చిక్కులు తప్పవు.!!

Leave a Reply