బాలీవుడ్ : ఐష్ సినిమా.. ఉత్కంఠ వీడింది

 Posted October 22, 2016

aishwarya rai ae dil hai mushkil movie release green signal

ఐశ్వర్యరాయ్ అభిమానులకి గుడ్ న్యూస్. “యే దిల్‌ హై ముష్కిల్‌” రిలీజ్ పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకి తెరపడింది.ఈ చిత్రంలో పాక్ నటుడు ఫవద్ ఖాన్నటించడం..యురి ఉగ్రవాద దాడి నేపథ్యంలో..పాక్ నటీనటులు నటించిన చిత్రాలని బ్యాన్ చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ సంస్థ హెచ్చరికలు జారీ చేయడంతో ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ రిలీజ్ ఉత్కంఠ నెలకొంది. దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రం రిలీజ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.తాజాగా,మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే, కరణ్ జోహార్ తో పాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ భట్ ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి.దీంతో..యే దిల్‌ హై ముష్కిల్‌ చిత్రానికి లైన్ క్లియర్ అయ్యింది.ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఏ దిల్ హై ముష్కిల్’లో 300 మంది భారతీయులు పనిచేశారని,పాకిస్థానీ నటుడుఫవద్ ఖాన్ కేవలం4 నిమిషాలు కనిపిస్తాడని..అయినాసరే సీఎంకు ఇచ్చిన రెండు హామీలను నిలబెట్టుకుంటామని..ఇకపై పాకిస్థాన్ నటీనటులని తీసుకోమని హామీ ఇచ్చారు.అంతేకాదు..భారత సైనికుల సంక్షేమం కోసం రూ.5కోట్లు విరాళం ప్రకటించింది  ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రబృందం.

SHARE