ఉయ్యాలవాడలో రానా క్లారిటీ వచ్చేసింది

0
406
aishwarya rai and rana not doing in chiru uyyalawada narasimha reddy movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

aishwarya rai and rana not doing in chiru uyyalawada narasimha reddy movie
చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు నుండి సెట్స్‌పైకి తీసుకు వెళ్లి, ఇదే సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రావాలనే పట్టుదలతో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఉన్నాడు. ఈ సమయంలోనే హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌, విలన్‌గా రానాలను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ఎంపికతో సినిమాపై బాలీవుడ్‌ దృష్టి కూడా పడనుందని, బాలీవుడ్‌లో ఉయ్యాలవాడకు మంచి మార్కెట్‌ లభించే అవకాశాలున్నాయి అంటూ ఎవరికి తోచిన కథనాలు వారు అల్లారు. అయితే వారిద్దరు ఈ సినిమాలో నటించబోతున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు తేల్చి పారేశారు.

మెగా ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా వెళ్లడైన విషయం ప్రకారం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతుంది. ఇంకా నటీ నటుల ఎంపిక వరకు వెళ్లలేదు. కథ పూర్తి అయిన తర్వాత దానికి తగ్గ నటీ నటులను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. ఈ విషయంపై ఇంకా చర్చ అనవసరం అని, రానాను ఇప్పటి వరకు ఉయ్యాలవాడ కోసం ఏ ఒక్కరు సంప్రదించలేదని, అస్సలు ఈ సినిమాలో రానాకు ఛాన్స్‌ ఉండబోదు అంటూ క్లారిటీ ఇచ్చారు. దాంతో ఇన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.

Leave a Reply