Posted [relativedate]
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్మురేపేస్తోంది. సెక్సీ లేడీ ఇన్ ద వరల్డ్ అనే మాటకు ఇప్పటికీ ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. అభిషేక్ ని పెళ్లిచేసుకుని బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా మారిన తర్వాత వరుస సినిమాలను చేయకుండా సెలెక్టెడ్ మూవీస్ ని మాత్రమే చేస్తోంది ఐష్. అయినా ఆమెకు, ఆమె సినిమాలకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ క్రేజ్ తోనే ఆమె మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా… ఐఎఫ్ఎఫ్ఏఏలో ఐశ్వర్యరాయ్ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. 2016లో విడుదలైన సరబ్జీత్ చిత్రంలోని దల్బీర్ కౌర్ పాత్రకు గానూ ఆమెకు ఈ అవార్డు లభించింది. పాకిస్థాన్ జైల్లో 23 సంవత్సరాల పాటు బందీగా ఉండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్ సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో ఐష్.. సరబ్జీత్ చెల్లెలిగా, డీ గ్లామరస్ గా అద్భత నటనను ప్రదర్శించింది. తన సోదరుడి కోసం రెండు దశాబ్దాలకు పైగా పోరాడే మహిళగా ఐశ్వర్య ఆకట్టుకుంది. సినిమాలో ఆమె నటనకు ఫిధా అయిన ఐఎఫ్ఎఫ్ఏఏ ఆమెకు ఉత్తమ నటి అవార్డును ప్రకటించింది.