Posted [relativedate]
రీ-ఎంట్రీతో బాలీవుడ్ ను ఊపేస్తోంది ఐశ్వర్యరాయ్. ఇటీవలే రన్ బీర్ కపూర్ తో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐష్ మళ్లీ పిచ్చెక్కిస్తోందని కామెంట్ కూడా వినబడుతున్నాయి. ‘ఎ దిల్ హై ముష్కిల్’ అంతగా రెచ్చిపోయింది ఐష్.
అయితే, ఇప్పటి వరకు ఆపర్ల కోసం ఐష్ ఎవ్వరిని అడిగింది లేదట. ‘దేవదాసు’ సినిమా తర్వాత షారుక్ ఖాన్ సరసన ఐదు సినిమాల్లో ఐశ్వర్యను నాయికగా
నటించమని సంప్రదించారు. ఐతే కొన్నాళ్లకు ఒక్కసారిగా ఆ సినిమాలన్నింటి లోనుంచి ఆమెను తప్పించారు. దీనిపై తాజాగా ఐష్ స్పందించింది. ”దేవదాస్’
తర్వాత కొన్ని సినిమాల్లో చేయమని నన్ను సంప్రదించారు. తెరపై మా జోడీ బాగుంటుంది. షారుక్ తో నటించడం కాదనలేని అవకాశం. నేనూ సంతోషపడ్డా. అయితే కొన్ని రోజుల తర్వాత సదరు చిత్రాల్లో వేరే నాయికలు ఎంపికయ్యారు. ఎందుకు నన్ను తీసుకోలేదు అని నేను ఎవరినీ అడగలేదు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. కెరీర్ మొత్తంలో ఒకరి దగ్గరికి వెళ్లి మీ సినిమాలో నటించాలా అని ఎప్పుడూ కోరలేదు. అంటూ చెప్పుకొచ్చింది ఐష్. అందాల కొండలాంటి అందాలు ఉండగా అడగాల్సిన అవసరం ఏముంది అంటూ ఐష్ వ్యాఖ్యలపై గుసగుసలాడుకొంటున్నారు బాలీవుడ్ జనాలు.