ఏపీ  సీఎస్‌ గా అజేయ కల్లం ఖరారు

0
607
ajay kallam as ap cs

Posted [relativedate]

ajay kallam as ap csఏపి  సీఎస్‌ ఎస్‌.పి. టక్కర్‌ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలోకి ఎవరు వస్తారు అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఏపిలో సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో పలువురి పేర్లు వినిపించినా ప్రభుత్వం అజేయ కల్లంను నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే అజేయ కల్లం నెల రోజులపాటు మాత్రమే సీఎస్‌గా పదవీ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.  మార్చి 31తో ఆయన పదవీ కాలం ముగియనుండటంతో ఆతర్వాత సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ బాధ్యతలు చేపడతారు.

ప్రస్తుత సీఎస్ టక్కర్ రేపటితో  పదవీ విరమణ పొందనున్నారు. దీంతో అజయ్ కల్లాం రేపే సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా అజేయ కల్లాం పదవీ గడువు పెంపుపై ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం ఆయన పదవీ గడువును పెంచేలా పావులు కదుపుతోంది.  ఒకవేళ గడువు పెంచినా  పెంచకపోయినా  కల్లాం సేవలను ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టనుంది. 

Leave a Reply