వెండితెర దేవుడికి నమోనమామి ..

0
564
ajini birthday special story

Posted [relativedate]

ajini birthday special story
మేకప్ వేస్తే హీరో ..మేకప్ తీస్తే జీరో.తెర మీద ఆదర్శం ..తెర తొలగిస్తే అరాచకం..తెర మీద న్యాయం …తెర వెనుక భోగం…ఇది నేతిచిత్ర సీమలో ఎందరరికో సరిగ్గా సరిపోయే వర్ణన.కానీ తెరమీద దేవుడిలా బతుకుతూ కూడా తెర వెనుక నిజమైన మనిషిలా …ఓ రిషిలా బతికే నిజాయితీ,ధైర్యం ఎవరికైనా ఉందా? కనీసం ఆ ప్రయత్నమైనా చేస్తున్నారా ? ఈ ప్రశ్నలకి జవాబుగా ఏ పేరు చెప్పాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.కానీ ఒక్క పేరు అందుకు మినహాయింపు. అయన మరెవరో కాదు ..సూపర్ స్టార్ రజని కాంత్ .

 rajini birthday

ప్రకృతి పగబట్టినా..సాటి మనిషి కరుణ చూపినా అంతా దేవుడి మహిమ అనుకునే సగటు భారతీయులు …వెండితెర మీద రజని ఏమి చేసినా సరే అంటారు. తెర దాటాక అయన ఎలా కనిపించినా ఒప్పుకుంటారు.అయితే ఇదేమీ అయాచిత వరం కాదు.తెర మీద నటన కన్నా తెర బయట నటన ఛాయలే లేని జీవితం గడపడం వల్ల సాధ్యమైన అసాధ్యం.వెండితెర వెలుగు జిలుగులు నిజమనుకునే భ్రమలో బతికే వారికి రజని నిరాడంబరత ఓ పాఠం.అందుకే వెండితెర దేవుడికి అయన పుట్టినరోజు సందర్భంగా నమోనమామి..

 Image result for rajini kanth birthday images

Leave a Reply