ఆమెకి లెటర్ బాంబు పంపిన దోవల్..

Posted October 7, 2016

 ajit doval reply arundhati roy letter
ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టె ది మరో దారంట.దేశమంతా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల గురించి,ఉగ్రవాద దాడుల గురించి ఆలోచిస్తుంటే..అరుంధతి రాయ్ అనే మేధావి మాత్రం భద్రతా దళాలకు దొరికిన తీవ్రవాదుల హక్కుల మీద ఆలోచించారు.పైగా గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్ వంటి పుస్తకాలు రాసి బుకర్ ప్రైజ్ కొట్టడంతో పాటు తరువాత కూడా మరికొన్ని రచనలు చేసిన అనుభవంతో ఆమె జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కి ఉగ్రవాదులతో సరిగ్గా వ్యవహరించాలని లేఖ కూడా రాశారు.అయితే అరుంధతి ఊహించని విధంగా దోవల్ దగ్గర నుంచి ఆమెకి ప్రతిలేఖ అందింది.ఓ విధంగా చెప్పాలంటే అది ఇండియన్ జేమ్స్ బాండ్ ప్రయోగించిన లెటర్ బాంబు.ఆ లేఖ సారాశం ఇదే ..

‘భారతీయ దళాలు పట్టుకున్న ఐసిస్,లష్కరేతోయిబా ఉగ్రవాదుల తో వ్యవరించాల్సిన తీరు మీద లేఖ రాసినందుకు కృతజ్ఞతలు.మీరు లేవనెత్తిన అంశాల్ని భద్రతా శాఖ సీరియస్ గా పరిశీలించింది.మీ వాణి ఢిల్లీలో ప్రతిధ్వనించింది.మీ అభ్యంతరాల్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రతా శాఖ లో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం.దాని పేరు లిబరల్స్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కిల్లర్స్ .

ఆ కొత్త విభాగం ఓ ఆలోచన చేసింది.ఉగ్రావాదుల్ని మీలాంటి వారి వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంచాలనుకుంటున్నాం.ఆలా మీవద్దకి ఎవరిని పంపాలో కూడా నిర్ణయించాం.వచ్చే సోమవారం అతన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ముంబై లోని మీ నివాసానికి తీసుకొస్తాం.అతని పేరు అలీ మహమ్మద్ అహ్మద్ బిన్ మహమూద్ .మీరు అహ్మద్ అని పిలుచుకోవచ్చు.మీ లేఖలో డిమాండ్ చేసినట్టే అతన్ని జాగ్రత్తగా చూసుకోండి.అవసరమనుకుంటే కొందరు సహాయకుల్ని కూడా పెట్టుకోండి.వారినికోసారి మీరు అతన్ని ఎలా చూస్తున్నారో మేము వచ్చి పరిశీలిస్తాం.అయితే అంత కన్నా ముందు అతని గురించి కొన్ని విషయాలు చెప్పాలి.

అహ్మద్ దారి తప్పినవాడు.హింసా ప్రవృత్తి కలవాడు.మీ మాటలతో మీరు చెప్పిన అతనిలోని ప్రవర్తనా లోపాల్ని సవరించండి.మీరు అందులో నిష్ణాతులనే నమ్ముతున్నాం.అయితే అతడు కొట్లాటల్లో ఆరితేరినవాడు.ఇంట్లో దొరికే పెన్సిల్ ముక్క,గోళ్లు తీసుకునే కట్టర్ లాంటి చిన్న చిన్న వస్తువుల్ని కూడా ఆయుధాలుగా వాడి ప్రాణాలు తీస్తాడు.మీరు యోగ చేసేటపుడు అలాంటివి చేసి చూడమని అతన్ని పొరపాటున కూడా అడగొద్దు.ఆలా చేస్తే అక్కడకి వచ్చిన వాళ్ళ పని అయిపోతుంది.ఇంట్లో దొరికే వస్తువులతోనే అతను పేలుడు పదార్ధాలు చేయగలడు.అతని స్వేచ్ఛకి భంగం కాదనుకుంటే వాటిని అతని కంట పడకుండా చూడండి.పైగా మీలాంటి,మీ కూతుళ్లు లాంటి ఆడోళ్ళంటే అతనికి చిన్న చూపు.ఆడవాళ్లు అతను అనుకున్న వస్త్రధారణ చేసుకోకపోతే అతను భరించలేడు.అవి అతని నమ్మకాలు,అభిప్రాయాలు అనుకుంటే వాటిని గౌరవించి చూడండి.

సాటి మనిషి పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్న మీకు మరోసారి కృతజ్ఞతలు.ఆ విషయంపై మమ్మల్ని అప్రమత్తం చేసిన మీ వైఖరి అభినందనీయం.మీరు మాత్రం అహ్మద్ ని బాగా చూసుకోండి.అతన్ని ఎలా చూస్తున్నారో మేము గమనిస్తూనే ఉంటాం.’
ఈ లేఖ చదివిన అరుంధతి రాయ్ మొహం మాడిపోయుంటుందో ..లేక ఓ ఉగ్రవాదిని సంస్కరించే అవకాశం దొరికినందుకు పొంగిపోయుంటుందో మీరే ఊహించుకోండి.ఆ మహా రచయిత్రికి ఓ విషయం చెప్పదలుచుకున్నాం …మేధోతనం అంటే భిన్నంగా ఆలోచించడం..వ్యక్తీకరించడం మాత్రమే కాదు సాగుతున్న జీవన స్రవంతిని ఉన్నదున్నట్టు అర్ధం చేసుకోవడం .ఆ లయకి తగ్గట్టు వ్యవహరించడం కూడా.

[wpdevart_youtube]yH2DZk2fWUk[/wpdevart_youtube]

SHARE