Friday, March 31, 2023
HomeEntertainmentCinema Latestమళ్లీ గాయపడ్డ అజిత్‌.. అభిమానులు కలవరం

మళ్లీ గాయపడ్డ అజిత్‌.. అభిమానులు కలవరం

గత సంవత్సరం ఒక సినిమా షూటింగ్‌ సందర్బంగా గాయపడ్డ తమిళస్టార్‌ హీరో అజిత్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల పాటు ఇంటికే పరిమితం అయిన విషయం తెల్సిందే. అంత ప్రమాదం జరిగినా కూడా ఏమాత్రం భయం లేకుండా మళ్లీ రిస్కీ షాట్స్‌ను అజిత్‌ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అజిత్‌ ‘వివేగం’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. అజిత్‌ ఫ్యాన్స్‌తో పాటు తమిళ సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన వివేగం టీజర్‌ దుమ్ము రేపిన విషయం తెల్సిందే. సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వివేగం సినిమా చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్‌ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో అజిత్‌ మళ్లీ గాయపడ్డట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అజిత్‌కు జరిగిన ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుంటున్నాడు. అజిత్‌ ప్రమాదం విషయం తెలిసిన అభిమానులు కలవరం చెందుతున్నారు. మళ్లీ అజిత్‌ ప్రమాదంకు గురి అవ్వడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వివేగం సినిమా మరి కొన్ని రోజుల్లో పూర్తి అవ్వనుంది అనుకుంటుండగా ఇలా జరగడం అందరిని నిరుత్సాహ పర్చుతుంది.

- Advertisment -
spot_img

Most Popular