నాలుగు వాటాలెయ్యండి..ఏపీ వాదన

 ak ganguly judge krishna water divided 4 states ap demand

కృష్ణా నది జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కోరింది. కృష్ణాజలాల కేటాయిపుపై బ్రిజేష్‌కుమార్ ట్రెబ్యునల్‌లో ఏపీ సుదీర్ఘ వాదనలు వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ వాదించారు. రాష్ట్రాలకు రాజకీయ సరిహద్దులు ఉంటాయి గానీ నదులకు ఉండవని, నది పుట్టుక నుంచి సము ద్రంలో కలిసేవరకు ఒకే యూనిట్‌గా పరిగణించాలని ఏపీ వాదనలు వినిపించింది.

నాలుగు రాష్ట్రాలను పరిగణన లోకి తీసుకుంటేనే నీటి కేటాయింపులు సాధ్యమని పేర్కొం ది. గతంలో ఏర్పడిన రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు కేంద్రమే నిర్ణయించిందని గుర్తుచేసింది. విభజన సమ యానికి ట్రెబ్యునల్ ఉనికిలో ఉన్నందున పునర్‌వ్యవస్థీ కరణ చట్టంలో సెక్షన్ 89ని కేంద్రం పొందుపరిచిందని, దీనిద్వారా నీటి కేటాయింపులు జరిపే బాధ్యతను ట్రెబ్యునల్‌కు అప్పగించిందని తెలిపింది.

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేస్తే ఎగువ రాష్ట్రాలు ఉల్లంఘించవా? అని ప్రశ్నించింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఎలా సాధ్యమవుతుందని అడిగింది. నీటి కేటాయింపులను పర్యవేక్షించేందుకు బోర్డులు ఉన్నాయని ఏపీ సమాధానం ఇచ్చింది.

SHARE