మనం డైరెక్టర్ తో అఖిల్ ?

 akhil act 'manam'movie director

అఖిల్ తరువాత మూవీ గురించి మరో వార్త బయటకు వచ్చింది .అక్కినేని ఫ్యామిలీకి మరపురాని చిత్రం మనం చేసిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ మరో సారి అఖిల్ తో పని చేయబోతున్నాడంట.ఇప్పటికే అఖిల్ సెకండ్ మూవీ గురించి అక్కినేని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హను రాఘవపూడి దర్శకత్వంలో అఖిల్ సెట్స్ పైకి వెళ్తాడని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. ఈ యువహీరో నెక్స్ట్ పిక్చర్ విక్రమ్ కుమార్ తో ఉంటుందని లేటెస్ట్ టాక్

అన్నపూర్ణ బ్యానర్ పై విక్రమ్ కుమార్ చేసిన ‘మనం’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో చిన్న పాత్రలోనైనా అఖిల్ ని చూపించిన తీరు అందరికీ నచ్చింది. దీంతో అఖిల్ రెండవ సినిమా ఛాన్స్ విక్రమ్ కి వెళ్లిందని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు.

SHARE