తమ్ముడు కూడా తక్కువేం కాదు..

0
851

  akhil have girl friend sriya bhupalనాగ చైతన్య, సమంత ప్రేమ వ్యవహారం జోరు గా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో తమ్ముడు కూడా తక్కువేం కాదని చూపించాడు.అఖిల్ ఒక్క సినిమాతోనే ప్రేమ విషయం బయట పెట్టి అటు కుటుంబానికి, ఇటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు.

అక్కినేని బుల్లి హీరో అఖిల్ ప్రేమలో పడ్డాడు.ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోతానే స్వయంగా చెప్పాడు.అయితే ఇప్పుడు అంతకు మించి ఇంకొక వార్త హల్ చల్ చేస్తోంది.అఖిల్ కి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందంట.కొంచెం హింట్ ఇస్తే చాలు అల్లుకు పోతారుగా మనోళ్లు.అదే అలవాటుతొ అల్లుకుపోయారో మరి నిజమో….. అఖిల్ ఈ విషయం పై స్పందించాడు. ప్రేమించడం నిజం.ఎంగేజ్ మెంట్ మాత్రం అబద్ధం అంటున్నాడు.అమ్మ నాన్నలకు పరిచయం చేశాను అంతే…ఎంగేజ్ మెంట్ అవ్వలేదు అని చెప్తున్నాడు అఖిల్.ఆ అమ్మాయి ఎవరని ప్రశ్నిస్తే అవన్నీ ఇప్పుడే చెప్పను అని తప్పించుకున్నాడు.

మరి ఇలాంటి విషయాలు దాగవుగా….అఖిల్ గర్ల్ ఫ్రెండ్ పేరు వివరాలు బయటకు వచ్చేశాయి.అఖిల్ ప్రేమించిన అమ్మాయి పేరు శ్రీయ భూపాల్,హైదరాబాద్ లోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శాలిని భూపాల్ కూతురు. ఈ అమ్మాయి అమెరికా న్యూయార్క్ లోని ఫార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ డిజైనింగ్ కోర్స్ చేసిందట.ఆ అమ్మాయి ఫ్యామిలీకి నాగ్ ఫ్యామిలీకి మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉందట.వీళ్ళ లవ్ మేటర్ ఇంట్లో తెలియదు.ఇటీవలే విషయాన్ని చెప్పి పరిచయం చేశాడట అఖిల్.ఈ విధమైన ప్రచారం జరుగుతోంది.ఇది నిజమో కాదో తెలియడానికి కొంత టైమ్ పడుతోంది.

Leave a Reply