మారుతిపై కన్నేసిన అఖిల్

0
551
akhil maruthi movie discussions

akhil maruthi movie discussions

అక్కినేని అఖిల్ మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అఖిల్ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ చూపించిన అఖిల్ ఆ సినిమా ఫ్లాప్ తో సెకండ్ మూవీ ఎలాంటిది తీయాలి అన్న కన్ ఫ్యూజన్ లోనే ఉన్నాడు. ఇప్పటికే అరడజను డైరక్టర్స్ తో సినిమా ఉందంటూ ఎనౌన్స్ చేసి చివరి నిమిషంలో వారిని కాదన్నాడని తెలిసిందే. మొన్నటిదాకా హను రాఘవపూడి డైరక్షన్లో సినిమాకు సిద్ధం అని చెప్పుకొచ్చిన అఖిల్ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుని మారుతి పై కన్నేశాడట.

చిన్న సినిమాలతో ప్రారంభమై బాబు బంగారంతో స్టార్ హీరోని కూడా పర్ఫెక్ట్ గా డీల్ చేయగలడు అన్న క్రేజ్ తెచ్చుకున్న మారుతి ఇప్పుడు అఖిల్ రెండో సినిమా డైరక్టర్ రేసులో ఉన్నాడట. ప్రస్తుతం మారుతి, అఖిల్ మధ్య కథా చర్చలు నడుస్తున్నాయట. దాదాపు ఈ కాంబినేషన్లో సినిమా రావడం గ్యారెంటీ అనేస్తున్నారు. అంతేకాదు సినిమా ఓకే అయితే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడని టాక్. మరి ఈసారైనా అఖిల్ మారుతిని కన్ ఫాం చేస్తాడా లేక మళ్లీ లేట్ చేస్తాడా అన్నది చూడాలి.

Leave a Reply