అఖిల్ కొత్త సినిమా టైటిల్.. చాలా కొత్తగా ఉందిగా

0
673
akhil new movie as junnu

Posted [relativedate]

akhil new movie as junnuఅక్కినేని అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొట్టిన దెబ్బతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అఖిల్.. తన రెండో సినిమా విషయంలో  జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ చిత్రం కూడా పోతే ఇక తాను  హీరోగా నిలదొక్కుకోవడం కష్టం కాబట్టి రెండో చిత్రంతో ఎలాగైనా సక్సెస్‌ అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. తమ కుటుంబానికి ఎవ్వర్ గ్రీన్  చిత్రాన్ని అందించిన మనం సినిమా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ కి అఖిల్ తన రెండో సినిమా బాధ్యతలను అప్పగించాడు.

ఏప్రిల్‌ 1న ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ ను మొదలుపెట్టనుంది చిత్రయూనిట్. ఈ చిత్రంలో అఖిల్‌ పేరు జున్ను అట. దీంతో సినిమాకి టైటిల్ గా కూడా జున్ను అనే ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. వినూత్నంగా టైటిల్‌ ఉంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుందని దర్శకుడు ఇదే టైటిల్‌ ను ఫిక్స్‌ చేయాలనుకుంటున్నాడట.  40కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవలం ఫైట్ల కోసమే ఏకంగా 20 కోట్లను కేటాయించి హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరి అఖిల్ జున్నుతోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Leave a Reply