హమ్యయ్య.. అఖిల్ రెండో మూవీ ముహూర్తం ఫిక్స్

0
568
akhil new movie shooting details

Posted [relativedate]

akhil new movie shooting detailsఎట్టకేలకు అక్కినేని అఖిల్ తన రెండో సినిమాను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. భారీ బడ్జెట్ మూవీగా ఎన్నో హోప్స్ మధ్య విడుదలైన అఖిల్ మొదటిసినిమా అఖిల్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తన రెండో సినిమా విషయంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ప్రతీ కధని సునిశతంగా విని చివరికి మనం సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కి ఓకే చెప్పాడు. ఓకే చెప్పి చాలా నెలలే గడిచినా ఓపెనింగ్ మాత్రం జరగలేదు. మధ్యలో ప్రేమ, నిశ్చితార్ధం అంటూ కాస్త సైడ్ ట్రాక్ లో పడ్డాడు అఖిల్. ఆ  ప్రేమ కాస్తా పెళ్లి పీటల వరకు రాకుండానే పల్టీ కొట్టింది. దీంతో మళ్లీ కాస్త కెరీర్ పై దృష్టిపెట్టినట్లు ఉన్నాడు. తన రెండో సినిమాను వెంటనే మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఏప్రిల్ -1న సినిమా ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో నాగార్జున స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. నాగార్జునే  అన్ని ప‌నుల‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్  లొకేషన్స్ వేటలో ఉందట. ఇక యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా ఉండాలని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని పిలిపిస్తున్నారట. 

కాగా ఇప్పటివరకు కామ్ గా ఉండి సడెన్ గా  ఈ రెండో సినిమా హాడావుడిని  తెరమీదకి తీసుకురావడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఖిల్ పెళ్లి రద్దు గురించి ఇంకా చర్చ జరగకుండా రెండో సినిమాని ట్రాక్ ఎక్కించే ప్లాన్ నాగ్ వేశాడని అంటున్నారు. దీంతో అందరూ పెళ్లి గురించి పక్కన పెట్టి అఖిల్ సినిమా ముచ్చట్లు చెప్పుకుంటారని నాగ్ భావించాడని చెబుతున్నారు.

Leave a Reply