భారీ చిత్రం అన్నారు.. మరి విలన్‌ ఈయనేంటి?

0
583
akhil new movie villain ajay

Posted [relativedate]

akhil new movie villain ajay
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. దాంతో రెండవ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో చాలా గ్యాప్‌ తీసుకుని ఇటీవలే కొత్త సినిమాను ప్రారంభించాడు. మొదటి సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పుడు అఖిల్‌ రెండవ సినిమాను నాగార్జున అంతకు మించిన బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘మనం’ ఫేం విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా అజయ్‌ను ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు వెళ్లడి చేశారు. భారీ బడ్జెట్‌ సినిమా అంటూ చిన్న విలన్‌ను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇటీవల పలు సినిమాల్లో అజయ్‌ చిన్న పాత్రల్లో, క్యారెక్టర్‌ రోల్స్‌లో, సెకండ్‌ విలన్‌గా నటించాడు. అలాంటి అజయ్‌ను ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌గా ఎంపిక చేయడం ఏంటని అక్కినేని ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. అయితే విక్రమ్‌ కుమార్‌ గతంలో తెరకెక్కించిన ‘ఇష్క్‌’ మరియు ‘24’ చిత్రాల్లో అజయ్‌ నటించి మెప్పించాడు. అందుకే మరోసారి అజయ్‌కు విక్రమ్‌ ఛాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply