డైరెక్టర్ మ్యారేజ్ ..హీరో కి బ్రేక్ ..

 akhil next movie break because director vikram k kumar marriage

అక్కినేని హీరో అఖిల్ రెండో సినిమా ఇష్యూ పలు ట్విస్టులు రుచిచూస్తోంది. సెకండ్ పిక్చర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతోందని స్వయంగా అఖిల్ ప్రకటించాడు. మరి ఏమైందో ఏమో.. వారం రోజుల్లోపు దర్శకుడు ఛేంజ్ అయ్యాడు. హను ప్లేస్ లో విక్రమ్ కె.కుమార్ వచ్చాడు. అక్కినేని కుటుంబానికి ‘మనం’లాంటి మంచి చిత్రాన్నిచ్చిన దర్శకుడు విక్రమ్. అఖిల్ ని తెరపై స్టైలిష్‌గా చూపించింది కూడా ఆయనే. క్లైమాక్స్‌లో కొన్ని క్షణాల్లో అఖిల్ కనిపించిన విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. దీంతో అఖిల్ ని స్టైలిష్ గా చూపించడంతో పాటూ హిట్టివ్వగల సత్తా విక్రమ్ కే ఉందని నాగార్జున భావిస్తున్నారట.

ఇటీవల పనిగట్టుకొని విక్రమ్ తో ఓ కథని సిద్ధం చేయించారట నాగార్జున. అది చాలా బాగా రావడంతో హనుని తప్పించి విక్రమ్ తో సినిమాని ఫైనల్ చేశారట. ఈ మూవీ ఈ నెల 29న ప్రారంభంకానుంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబరులోనే మొదలవుతుంది. స్క్రిప్ట్‌ పక్కాగా సిద్ధమైంది కాబట్టి సెప్టెంబరులోనే షూటింగ్ మొదలుపెట్టొచ్చు. కానీ ఆ నెలలో విక్రమ్ పెళ్లి ఉంది. దీంతో నెల రోజులు సమయమడిగాడట ఈ ’24’ డైరక్టర్. విక్రమ్ పెళ్లి సందడి పూర్తయ్యాకే అక్టోబరులో సినిమా షూటింగ్ ని మొదలుపెడతారని ఫిల్మ్‌నగర్ టాక్.

SHARE