Sunday, October 17, 2021
HomeEntertainmentCinema Latestఅఖిల్‌ అమ్మ ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు

అఖిల్‌ అమ్మ ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు

అఖిల్‌ మొదటి సినిమా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పర్చింది. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్‌’ సినిమా అంచనాలు తారు మారు చేస్తూ అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో నాగార్జున మరియు అఖిల్‌లు చాలా గ్యాప్‌ తీసుకుని ఎన్నో కథలు విన్న తర్వాత, పలువురు దర్శకులతో చర్చలు జరిపిన తర్వాత అఖిల్‌ రెండవ సినిమాను విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇటీవలే అఖిల్‌ రెండవ సినిమా పట్టాలెక్కింది. ఇంకా హీరోయిన్‌ ఎంపిక జరగలేదు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పాత్రలో టబును నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున, టబుల మద్య వ్యవహారం జరిగిందని, ఇద్దరు చాలా సన్నిహిత్యం ఉంటారు అనే ప్రచారం జరిగింది. ఇద్దరి మద్య ప్రేమ కూడా నడిచిందనే వార్తలు వచ్చాయి. కాని తామిద్దరి మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇప్పటికి కూడా నాగార్జున, టబులు చెబుతూ వస్తున్నారు. అలాంటి టబును తన కొడుకు అఖిల్‌ కోసం తీసుకు వచ్చేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోయిన్‌గా ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు రాని టబు ఇలాంటి పాత్రలు కూడా చేసేందుకు ఇటీవలే ఒప్పుకుంటాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందుకే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ కూడా ఆమెను అఖిల్‌ పాత్రకు తల్లి అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాకు టబు పాత్ర హైలైట్‌గా అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు

- Advertisment -
spot_img

Most Popular