నాగ్ మరో తప్పు చేస్తున్నాడా..?

0
466
Akhil second movie budget 40 cr

 Posted [relativedate]Akhil second movie budget 40 cr

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరో తప్పు చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. చైతూకి పెళ్లికాకుండా కనీసం ఎంగేజ్మెంట్ కూడా కాకుండా చిన్న కొడుకు అఖిల్ కి నిశ్చితార్ధం చేసి తప్పు చేశాడన్న ఫీలింగ్ ని కలిగించాడు నాగ్. అయితే అది వ్యక్తిగతమే అయినా కూడా ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన పర్సనల్ విషయాలను కూడా పట్టించుకుంటారు అభిమానులు. ఈ విషయాన్ని తీసి పక్కనపెడితే తాజాగా అఖిల్ రెండో సినిమా విషయంలో  కూడా నాగ్  తప్పు చేస్తున్నాడంటూ ఫిలింనగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.

అఖిల్ మొదటి సినిమా  అంటూ భారీగా  హైప్ తీసుకొచ్చి  నిర్మాత నితిన్ భారీగా ఖర్చుపెట్టేశాడు. భారీ బడ్జెట్ పెట్టడం వల్ల భారీ రేట్లకు అమ్ముడు పోయినా సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు అతడి మీద మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. అయితే నాగ్ మాత్రం కొడుకు విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఏకంగా 40కోట్ల బడ్జెట్ తో అఖిల్ రెండో సినిమాను రూపొందిస్తున్నాడు.

మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఈ 40కోట్ల బడ్జెట్ లో కేవలం 20కోట్లు యాక్షన్ ఎపిసోడ్స్ కే కేటాయించాడట. హాలీవుడ్ యాక్షన్ సినిమాల తరహాలో ఈ సినిమా సాగనుందట. కాగా ఈ వార్త విన్న సినీ విశ్లేషకులు…  నితిన్ చేసిన తప్పే నాగ్ కూడా చేస్తున్నాడని అనుకుంటున్నారు. అఖిల్ సినిమా ఫలితంతో ఈ రెండో సినిమాను అంత రేటు పెట్టి కొనడానికి బయ్యర్లు   వస్తారా అని అనూమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నాగ్ చేస్తున్న ఈ రిస్క్ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Leave a Reply