అఖిల్ కి ఈ డైరెక్టర్ అయినా సెట్ అవుతాడా..?

0
437

 akhil second movie director tarun bhaskarఒక్క సినిమా హిట్టు కొడితే చాలు. ఆ డైరక్టర్ క్రేజ్‌ అమాంతం పెరిగిపోతుంది. నిర్మాతలు అడ్వాన్సులతో క్యూ కడతారు. హీరోలు ఫోన్లు చేసి ‘కథేమైనా ఉందా’ అంటూ పలకరిస్తారు. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌కి ఇలాంటి డిమాండే ఉంది. ‘పెళ్లిచూపులు’ మూతో ఇండస్ట్రీని తన వైపుకి తిప్పుకొన్నాడు భాస్కర్‌. చిన్న సినిమాగా విడుదలైన ‘పెళ్లి చూపులు’ బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.

దీంతో భాస్కర్‌తో సినిమా చేసేందుకు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ జాబితాలో అక్కినేని వారసుడు అఖిల్‌ కూడా ఉన్నాడు. అఖిల్‌కి ‘పెళ్లిచూపులు’ బాగా నచ్చిందట. ‘ఈమధ్య నాకు బాగా కనెక్ట్‌ అయిన సినిమా ఇదంటున్నాడు అఖిల్‌. తరుణ్‌ భాస్కర్‌తో తనకు ముందే పరిచయముందని చెప్తున్నాడు. అతను చేసిన ఓ షార్ట్‌ ఫిల్మ్స్‌ చూసి పిలిపించుకుని తనకు తగిన కథ ఉంటే చెప్పు అని అడిగాట. కానీ భాస్కర్ లేదని చెప్పాటడ. ఇక ‘పెళ్లిచూపులు’పై పొగడ్తలు కురిపించేస్తున్న అఖిల్ తనతో సినిమా చేయడానికి ఇప్పటికీ సిద్ధమే అంటున్నాడు. అఖిల్ తన రెండో చిత్రానికి తగిన దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. భస్కర్ ఓకే అనేస్తే… ఆ సమస్య తీరిపోయినట్టే

Leave a Reply