రోమ్ నగరంలో అఖిల్ వివాహం..!

0
771

Posted [relativedate]

akk11అక్కినేని అఖిల్ తన చిన్ననాటి స్నేహితురాలు శ్రీయా భూపాల్ తో పరిణయమాడనున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త జివికె కుటుంబానికి చెందిన శ్రీయా భూపాల్ అఖిల్ ల వివాహం ఇటలీలో నిర్వహించనున్నారట. ఈ విషయం స్వయంగా అఖిల్ సోదరుడు నాగ చైతన్య వెళ్లడించారు.

చారిత్రాత్మక నగరం, పర్యాటక కేంద్రంగా ఉన్న రోమ్ నగరంలో ఈ వివాహం జరుగనున్నదట. ఇటు అక్కినేని ఫ్యామిలీ అటు జివికె ఇరు కుటుంబాలు మంచి పొజిషన్ లో ఉండటం చేత అఖిల్, శ్రీయల పెళ్లి అక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ వివాహ మహోత్సవం ఉండొచ్చని అంటున్నారు. అత్యంత భారీగా ఈ పెళ్లి వేడుకలను ఏర్పాటు చేయనున్నారట. పెళ్లి అక్కడ జరిపినా రిసెప్షన్ గ్రాండ్ గా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారట.

అక్కినేని వారసుడు అఖిల్ ఒక్క సినిమాతోనే పెళ్లి చేసుకుంటాడన్న రూమర్లు వస్తున్నా అవేవి పట్టించుకోకుండా అఖిల్ తన పెళ్లికి సంసిద్ధమవుతున్నాడు. ఈమధ్యనే హీరోగా రెండో సినిమా విక్రం కుమార్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్ పెళ్లి చేసుకున్నాక కాని ఆ సినిమా స్టార్ట్ చేసేట్టు కనబడట్లేదు.

Leave a Reply