అఖిల్… వాట్స్ దిస్ యార్..?

0
687
akhil sriya bhupal marriage cancelled reason

Posted [relativedate]

akhil sriya bhupal marriage cancelled reasonటాలీవుడ్ లో హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్న విషయం ఉందంటే అది అఖిల్ పెళ్లి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఇద్దరి కొడుకుల ఎంగేజ్ మెంట్ కూడా ఘనంగా జరిపించాడు నాగార్జున. త్వరలోనే అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి అని ఎదురు చూసిన అభిమానులకు గట్టి షాక్ తగిలింది. అఖిల్, శ్రియా భూపాల్ ల పెళ్లి రద్దైనట్లు నిన్నట్నుంచి మీడియాలో తెగ హోరెత్తిపోతోంది. ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన వారి పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడమే కారణమని అక్కినేని సన్నిహితుల సమాచారం.

అఖిల్ చిన్నప్పటి నుండి  దూకుడు స్వభావం కలవాడని చెబుతున్నారు. ప్రతి  విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాడని,  ఎవరు చెప్పినా  వినేవాడు కాదని అంటున్నారు. తన మొదటి సినిమా విషయంలోను ఇదే మొండివైఖరి ప్రదర్శించాడంటున్నారు. కొరటాల శివ, త్రివిక్రమ్ ల డైరెక్షన్ లో మొదటిసినిమా చేస్తే కెరీర్ బాగుంటుందని, కాస్త వెయిట్ చేయమని నాగార్జున ఎంత నచ్చచెప్పినా వినలేదట. మనం సినిమాలో తన గ్రాండ్ ఎంట్రీని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారని, ఈ మూమెంట్ లోనే తన డెబ్యూ మూవీ చేయాలని పట్టుపట్టాడట. వినాయక్ ఆల్రెడీ తనకో కధని వినిపించాడని, వెంటనే ఆ సినిమాను చేస్తానని తేల్చి చెప్పాడట అఖిల్.

ఇక శ్రియతో ప్రేమాయణం నడిపినప్పుడు కూడా నాగ్… అఖిల్ కి నచ్చచెప్పాడట. ఈ పెళ్లి సెట్ కాదని, ఆమె వయసులో పెద్దదని  ఎన్నో రకాలుగా అఖిల్ ని బుజ్జగించాడట నాగ్. ఫస్ట్ కెరీర్ లో సెట్ అవ్వమని నాగ చైతన్య కూడా సజెస్ట్ చేశాడట. కానీ అఖిల్ మాత్రం ససేమిరా అనడంతో నాగ్ వాళ్ల ఎంగేజ్ మెంట్ ని జరిపించాడు.

 ఇక అఖిల్, శ్రియల పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి వారి  మధ్య ఉన్న గొడవలే కారణమని తెలుస్తోంది.   ఈ గొడవలు టీఎస్ఆర్ కుమార్తె పింకీ రెడ్డి కొడుకు పెళ్లి నుండి ప్రారంభమయ్యాయని సమాచారం. తమ పెళ్లి ఏర్పాట్లకై అఖిల్, శ్రియలు విదేశాలకు వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లినప్పుడు కూడా వాదించుకున్నారట. పక్కనే శ్రియ తల్లి ఉన్నా కూడా  సర్ధిచెప్పలేదట. ఆ గొడవలు కాస్త చిలికిచిలికి గాలి వాన అయినట్లు పెళ్లి రద్దు వరకు వచ్చాయని తెలుస్తోంది. విషయం నాగార్జున తెలియడంతో ఇద్దరికీ నచ్చజెప్పాలని చూశాడట. అయినా ఫలితం లేకపోయిందని సమాచారం.

అసలే ఓం నమో వెంకటేశాయ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అప్సెట్ లో ఉన్న  నాగ్.. అఖిల్ విషయంతో మరింత కుంగిపోయాడట. అందుకే రెండు రోజులు ఇంటి నుండి బయటకి రాలేదని, చివరకి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడలేదని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా అఖిల్, శ్రియలు మనసు మార్చుకుంటారేమో చూడాలి.

Leave a Reply