వాట్…నాగార్జున కొడుకు పెళ్లి ఆగిపోయిందా?

0
533
akhil wedding cancelled with shriya bhupal

Posted [relativedate]

akhil wedding cancelled with shriya bhupalగత కొన్ని నెలలుగా అక్కినేని వారసుల పెళ్లి వార్తలు టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి నాగ్ చిన్నకొడుకు అఖిల్ పెళ్లి గురించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అఖిల్‌, జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయాభూపాల్‌ పెళ్లి ఆగిపోయిందని ఆ వార్తల సారాంశం.

గత ఏడాది డిసెంబర్‌ లో అఖిల్‌, శ్రియా నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా  ఈ ఏడాది మేలో ఇటలీలో వాళ్ల పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.  పెళ్లి పనులను కూడా చాలా భాగం పూర్తిచేసేశారు. హోటల్ రూమ్స్, రిసార్ట్స్ చాలా వరకు బుక్ చేసేశారు. అయితే కారణాలు  తెలియవు కానీ గత శనివారం అక్కినేని, జీవీకే కుటుంబ సభ్యులు…  తమతమ బంధువులందరినీ అఖిల్ పెళ్లికి సంబంధించిన  ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ వివాహాన్ని ఇరు కుటుంబాల వారు ఆపేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు వారి సన్నిహితులు అంటున్నారు. ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే అక్కినేని కుటుంబసభ్యులు చెప్పేవరకు ఆగాల్సిందే.

Leave a Reply