చిరు సెట్లో అఖిల్ సందడి..!

akhil went chiru 150 movie sets

మెగాస్టార్ సుధీర్గ విరామం తర్వాత చేస్తున్న మూవీ ఖైది నెంబర్ 150 షూటింగ్ హైదరబాద్ లోనే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వి.వి.వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా నుండి వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. ఈ మధ్యనే హీరోయిన్ కాజల్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా సెట్ కు ఈరోజు సర్ ప్రైజ్ గెస్ట్ అఖిల్ వెళ్లడం జరిగిందట. మెగాస్టర్ కు అభిమాని అయిన అఖిల్ తన షూట్ కు వెళ్లడం అక్కడ చిత్రయూనిట్ తో మాట్లాడటం జరిగిందట.

ఇక తనను హీరోగా చేసిన వినాయక్ తో ఓ సెల్ఫీ దిగి దాన్ని షేర్ చేశాడు అఖిల్. సినిమా నిర్మాత రాం చరణ్ కూడా అఖిల్ కు మంచి స్నేహితుడు సో ఈ కారాణల వల్ల చిరు సెట్స్ లో అఖిల్ సందడి చేయడం జరిగింది. అఖిల్ ఎంట్రీ తో చిత్రయూనిట్ తో ఓ కొత్త ఉత్సాహం వచ్చిందట. కొద్దిసేపు సందడి చేసిన అఖిల్ మళ్లీ మూవీ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేశాడట. సాగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిరు మూవీ అనుకున్న టైంలోనే కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

SHARE