ములాయం కి అఖిలేష్ ఫోన్..

65
Spread the love

Posted [relativedate]

akhilesh call to mulayum
యూపీ రాజకీయాల్లో మరో మలుపు.తండ్రి తో కయ్యానికి సై అన్న కొడుకు కాస్త బెట్టు సడలించాడు. తండ్రి ములాయం కి అఖిలేష్ ఫోన్ చేశాడు.తండ్రీకొడుకుల మధ్య రాజీకి సీనియర్ నేత అజాం ఖాన్ చొరవతో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ ఫోన్ సంభాషణలో ఏమి జరిగిందో కానీ ఢిల్లీలో ఉన్న ములాయం ఛార్టర్డ్ ఫ్లైట్ లో లక్నో బయలుదేరారు. అటు ఈ ఫోన్ సంభాషణకు కారణమైన అజమ్ ఖాన్ కూడా పార్టీలో సంక్షోభం చల్లారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేయడంతో సమాజ్ వాది శ్రేణుల్లోను కొత్త ఆశలు రేగుతున్నాయి.ఏమైనా తండ్రీకొడుకుల మధ్య చిక్కుముడి విప్పడానికి ఆ ఫోన్ కాల్ పని చేస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here