బాబాయ్ శల్యసారధ్యం ..అబ్బాయి కి ఆగ్రహం

Posted January 31, 2017

akhilesh is serious about shivapal attitudeసుదీర్ఘ పోరాటం తర్వాత శాంతికపోతం ఎగిరింది అనుకుంటున్న సమాజ్ వాది పార్టీలో కుంపటి ఆరలేదని తేలిపోయింది.అదే పార్టీ అభ్యర్థిగా జస్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ములాయం సోదరుడు,అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ ఓ బాంబు పేల్చాడు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే,ములాయం తో కలిసి తాను కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.ప్రచారానికి వెళ్లి ఇటావా ర్యాలీ లో శివపాల్ ఈ ప్రకటన చేయడంతో పార్టీలో కుదిరింది ఉత్తుత్తి రాజీ మాత్రమేనని అర్ధమవుతోంది.పైకి రాజీ పడినట్టు నటించిన శివపాల్ ఇలా ఎస్పీ గెలుపు అవకాశాల్ని దెబ్బ కొట్టేందుకు బహిరంగంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కాంగ్రెస్ తో ఎస్పీ పొత్తు ని వ్యతిరేకిస్తున్నట్టు ఓ సాకు చూపి ..ప్రజల్లో ప్రతికూల ప్రభావం పడేలా శివపాల్ చేస్తుంటే …ములాయం చూస్తూ ఊరుకున్నారు.ఆయన ఇప్పటికే ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.కాంగ్రెస్ పొత్తు తో సానుకూల వాతావరణం మొదలైన ఈ దశలో బాబాయ్ వ్యాఖ్యలు అబ్బాయి అఖిలేష్ కి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీతో శివపాల్ కి సంబంధం లేదని ఓ ప్రకటన చేద్దామని అఖిలేష్ ఆలోచిస్తున్నారు.

SHARE