Posted [relativedate]

అఖిలేశ్ కొత్త పార్టీ పేరుపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. రాష్ట్రీయ సమాజ్ వాదీ పార్టీ- ఆర్ఎస్పీ పేరుతో వస్తుందని అంచనా. అఖండ సమాజ్ వాదీ పార్టీ- ఏఎస్పీ పేరు కూడా పరిశీలనలో ఉందట. రెండూ కుదరకపోతే శుద్ధ్ సమాజ్ వాదీ పార్టీ-ఎస్ఎస్పీ అని కూడా పార్టీ పేరు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. మర్రిచెట్టును పార్టీ సింబల్ గా ప్రకటించవచ్చని టాక్. కారు గుర్తువైపు కూడా మొగ్గు చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
అయితే ప్రస్తుతానికి సీఎం అఖిలేశ్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. ఈ తరుణంలో అప్పట్లో ఏపీలో చంద్రబాబు నాయుడులా .. అఖిలేశ్ కూడా ఎస్పీ తనదేనని వాదించే అవకాశం ఉంది. బాబు ఫార్ములాను ఫాలో అయితే అఖిలేశ్ కు ఎస్పీ సొంతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఎస్పీ తన సొంతం కాకపోతే అప్పుడు కొత్త పార్టీపై ఫోకస్ పెట్టే అవకాశముందని టాక్. అయితే ఎందుకైనా మంచిదని ఇప్పటి నుంచి కొత్త పార్టీ పేర్లను పరిశీలిస్తోందట అఖిలేశ్ వర్గం.