Posted [relativedate]
సవతి తల్లి రాజకీయ ఎత్తుగడల్ని సమర్ధంగా తిప్పికొడ్తున్నాడు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్.బాబాయ్ శివపాల్ ని ప్రత్యామ్న్యాయ శక్తిగా ప్రోత్సహిస్తున్న తండ్రి ములాయం కి అఖిలేష్ కొత్త పార్టీ ఆలోచనతో కౌంటర్ ఇస్తున్నాడు.త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ తో పొత్తు ద్వారా వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోడానికి అఖిలేష్ రెడీ అవుతున్నాడు.ఆ పార్టీకి ప్రగతిశీల సమాజ్ వాది పార్టీ లేదా జాతీయ సమాజ్ వాది పార్టీ అనే పేర్లు పరిశీలనలో వున్నాయి.తండ్రిది సైకిల్ గుర్తు అయితే అఖిలేష్ డి మోటార్ సైకిల్ గుర్తు అయ్యే అవకాశం ఉన్నట్టు అయన సన్నిహితులు చెప్తున్నారు.
అఖిలేష్ ప్రయత్నాలతో ములాయం వర్గం ఖంగుతింది.వారు చేపట్టిన సర్వే లో ములాయం,శివపాల్ కన్నా అఖిలేష్ కే ప్రజాభిమానం ఉందని తేలింది.అది చూసాక ములాయం కూడా పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.తన్ని తప్పు దోవ పట్టించారని తమ్ముడు శివపాల్ ,రెండో భార్య సాధన మీద కోప్పడినట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.నవంబర్ 5 నుంచి పార్టీ రజతోత్సవాలు జరగాల్సి ఉండగా ….3 వ తేదీ నుంచి అఖిలేష్ రాష్ట్రవ్యాప్త రధ యాత్ర కి వెళుతున్నారు.దీంతో ములాయం వర్గం దిగొచ్చినట్టు కనిపిస్తోంది.ఈసారి కూడా పార్టీ గెలిస్తే అఖిలేష్ ముఖ్యమంత్రి అవుతారని శివపాల్ ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ.అయితే ఇందాక వచ్చాక అఖిలేష్ రాజీ పడతాడో..ముందుకే వెళతాడో చూడాలి.